epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కరీంనగర్‌లో కిరాతకం!

కరీంనగర్‌లో కిరాతకం!
మత్తుమందు ఇచ్చి యువతిపై అఘాయిత్యం
గర్భం దాల్చాక గర్భస్రావం..
పెళ్లి పేరిట వంచించి, బెదిరింపులకు పాల్పడిన యజమాని
‘నాకేం కాదు’ అంటూ నిందితుడి దర్పం.. కేసు నమోదు చేసి గాలిస్తున్న పోలీసులు

కాక‌తీయ‌, కరీంనగర్ : కరీంనగర్ నగరంలో పెళ్లి పేరుతో సాగించిన ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్వేరియం షాపు యజమాని ఒకరు ఉద్యోగినిని నమ్మించి, మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసి, చివరకు గర్భం దాల్చిన తర్వాత గర్భస్రావం చేయించి దారుణానికి ఒడిగట్టిన ఘటన సంచలనం రేపింది. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ ఘటన, నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. 2025 ఏప్రిల్‌లో ఆమె కరీంనగర్‌లోని క్రిస్టియన్ కాలనీలో ఉన్న ఆకుల నరేష్ అనే వ్యక్తికి చెందిన అక్వేరియం షాపులో ఉద్యోగంలో చేరింది. యజమాని నరేష్ మొదట స్నేహపూర్వకంగా ఉంటూనే, ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించాడు. బాధితురాలు తొలుత నిరాకరించి ఉద్యోగానికి రాజీనామా చేసినా, నరేష్ మళ్ళీ పెళ్లి మాట ఎత్తనని నమ్మించడంతో తిరిగి చేరింది. అయితే, 2025 జూన్ 6న గది చూపిస్తానని నమ్మించి తీసుకెళ్లిన నరేష్, కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశాడు. ఆ అపస్మారక స్థితిలో యువతిపై అత్యాచారానికి పాల్పడి, విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు.

చట్టాన్ని వెక్కిరిస్తూ.. నిందితుడి బెదిరింపులు
అప్పటి నుంచి పెళ్లి చేసుకుంటానని నమ్మబలుకుతూ నరేష్ పలుమార్లు శారీరక సంబంధం కొనసాగించాడు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చగా, 2026 ఏప్రిల్‌లో ఆమెకు గర్భస్రావం కలిగించే మందులు ఇచ్చి గర్భాన్ని తొలగించాడు. వివాహం గురించి నిలదీసిన ప్రతిసారీ కాలయాపన చేస్తూ వచ్చిన నరేష్, చివరకు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని, పోలీసులకు ఫిర్యాదు చేసినా తనను ఏమీ చేయలేరంటూ బాధితురాలిని బెదిరించాడు. నిందితుడి వేధింపులు, బెదిరింపులు తాళలేక బాధితురాలు చివరికి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు ఆకుల నరేష్ కోసం గాలింపు చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలి ఆరోపణలతో షాక్ తిన్న స్థానికులు, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దర్యాప్తు పూర్తయితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.