epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చేర్యాలలో ‘వృక్ష’ సంహారం

చేర్యాలలో ‘వృక్ష’ సంహారం
య‌థేచ్ఛ‌గా క‌ల‌ప అక్ర‌మ ర‌వాణా
చేర్యాల మండ‌లంలో వృక్ష సంపద నాశనం
నోట్ల‌తో అధికారుల నోళ్లు మూయిస్తున్న మాఫియా
పర్యావరణానికి తూట్లు.. హరితహారం లక్ష్యం గాలికి
నిఘా కరువై దళారుల దందా.. పట్టించుకోని రెవెన్యూ, అటవీ శాఖలు
ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్

కాకతీయ, చేర్యాల : రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరుతో పర్యావరణ పరిరక్షణకు వందల కోట్లు ఖర్చు చేస్తుంటే, మరోవైపు చేర్యాల మండలంలో అక్రమార్కులు విచ్చలవిడిగా చెట్లను నరికివేస్తూ పర్యావరణానికి తీవ్ర ద్రోహం చేస్తున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో విలువైన వృక్షాలను దళారులు నరికి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా, సంబంధిత అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ప్రధాన రహదారులను ఆనుకుని ఉన్న చెట్లను నరికి, లారీలు మరియు ట్రాక్టర్ల ద్వారా పట్టపగలే తరలిస్తున్నా రెవెన్యూ, పంచాయతీ, అటవీ మరియు రోడ్లు-భవనాల (ఆర్అండ్ బీ) శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాల్టా చట్టం ప్రకారం అనుమతులు లేకుండా జిరాయితీ భూముల్లో చెట్లను తీయకూడదు, కానీ చెరువులు, గ్రామకంఠాలు, ప్రభుత్వ స్థలాల్లోని వృక్ష సంపదను తరలిస్తున్నా అధికారులు అభ్యంతరం చెప్పకపోవడం వెనుక పెద్ద ఎత్తున కాసులు చేతులు మారడమే కారణమని ప్రజలు ముక్తకంఠంతో ఆరోపిస్తున్నారు.

పర్యావరణానికి తూట్లు.. హరితహారం లక్ష్యం గాలికి

పర్యావరణ సమతుల్యత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న హరితహారం లక్ష్యానికి ఈ నరికివేత ఘటనలు తూట్లు పొడుస్తున్నాయి. చెట్లు కేవలం నీడనే కాకుండా నేల సారాన్ని పెంచడంలో, వర్షపాతం సమతుల్యతలో, గాలి కాలుష్యాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, అక్రమ నరికివేత ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వ్యవసాయానికే తీవ్ర నష్టం వాటిల్లుతుందని పర్యావరణ ప్రేమికులు హెచ్చరిస్తున్నారు. ఈ అక్రమ రవాణాకు అటవీ అధికారుల పర్యవేక్షణ లోపం ప్రధాన కారణమని, కొందరు అటవీ ఉద్యోగులు అక్రమార్కులకు సహకరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, ఆయా గ్రామాల్లోని అటవీ ప్రాంతాలను ప్రత్యక్షంగా సందర్శించి, అక్రమ కట్టెల రవాణాకు సహకరిస్తున్న వారిపై మరియు అవినీతికి పాల్పడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అడవులను రక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.