epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రూ.కోటి గంజాయి పట్టివేత

రూ.కోటి గంజాయి పట్టివేత
ఐదుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్ల అరెస్ట్
ఖమ్మం జిల్లా కొణిజర్లలో పోలీసుల మెరుపు దాడి
రూ.కోటి విలువైన 201 కేజీల ఎండు గంజాయి స్వాధీనం
పైలట్ వాహనంతో సహా రెండు కార్లు సీజ్
మహారాష్ట్ర, తెలంగాణ కేంద్రంగా సాగుతున్న అక్రమ రవాణా
పరారీలో ప్రధాన సూత్రధారులు.. ముమ్మర గాలింపు ప్రారంభం

కాక‌తీయ‌,ఖ‌మ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో భారీ గంజాయి ముఠా గుట్టురట్టయింది. అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయలకు పైగా విలువైన 201 కేజీల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని, ఐదుగురు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు కొణిజర్ల ఎస్సై సూరజ్ వివరాలను వెల్లడించారు. వైరా ఏసీపీ సారంగపాణి ఆదేశాల మేరకు, శనివారం కొణిజర్ల హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. వైరా వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ఒక బొలెరో వాహనాన్ని , దానికి పైలట్‌గా వస్తున్న మారుతీ డిజైర్ కారును పోలీసులు అనుమానాస్పదంగా గుర్తించి నిలిపివేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయగా, అందులో అక్రమంగా ఎండు గంజాయి తరలిస్తున్నట్లు వెల్లడైంది. వెంటనే పోలీసులు ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు.

మహారాష్ట్ర, తెలంగాణ కేంద్రంగా ముఠా
అరెస్ట్ అయిన వారిలో మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాకు చెందిన అమూల్ నానోబా గోరే, లక్ష్మణ్ నాగనాథ్ కరే ఉండగా, తెలంగాణలోని కామారెడ్డి జిల్లాకు చెందిన వసంత జాధవ్, షేక్ ఆన్సర్, షేక్ రహ్మత్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ. 1,00,50,000 విలువైన 201.45 కేజీల ఎండు గంజాయితో పాటు, రెండు వాహనాలు, ఏడు సెల్ ఫోన్లు, రూ. 2,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. అయితే, ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న ప్రధాన సరఫరాదారులు, గంజాయిని స్వీకరించాల్సిన రిసీవర్లు పరారీలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు. మత్తు పదార్థాల రవాణాకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.