భవిత భవనం ప్రారంభోత్సవం
దివ్యాంగులకు మెరుగైన సేవలే లక్ష్యం
: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
రూ.3 లక్షలతో పునర్నిర్మించిన భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
కాకతీయ, మణుగూరు రూరల్ : మణుగూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో రూ.3 లక్షల వ్యయంతో పునర్నిర్మించిన భవిత భవనాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివ్యాంగులకు, ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు వారి కుటుంబాలకు మెరుగైన సేవలు అందించడంలో భవిత కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచేందుకు కట్టుబడి ఉందని, ఈ భవన పునర్నిర్మాణం ద్వారా సేవల నాణ్యత పెరగడమే కాకుండా లబ్ధిదారులకు మరింత అనుకూల వాతావరణం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరేష్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎంఈఓ స్వర్ణ జ్యోతి, ఐఈఆర్పీలు నాగశ్రీ, వీరు నాయక్, మండల మరియు టౌన్ అధ్యక్షులు, జిల్లా ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

