epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మాదక ద్రవ్యాల ఉచ్చులో పడొద్దు 

మాదక ద్రవ్యాల ఉచ్చులో పడొద్దు 
వ్యసనాల నుంచి బయటపడితే కేసుల్లేవు.. ఉచిత వైద్యం
ఖ‌మ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి
జిల్లా జైలులో ఖైదీలకు ప్రత్యేక అవగాహన సదస్సు
కాకతీయ ఖమ్మం టౌన్ : తాత్కాలిక ఆనందం కోసం గంజాయి, డ్రగ్స్ వంటి సామాజిక మహమ్మారుల బారిన పడి బంగారు జీవితాలను నాశనం చేసుకోవద్దని ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి సూచించారు. జూన్ 26న అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఖమ్మం జిల్లా జైలులో ఖైదీలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ మాట్లాడుతూ.. ఖైదీలకు మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలు, శారీరక, మానసిక దుష్పరిణామాలు మరియు వాటి నుంచి విముక్తి పొందే మార్గాలపై పూర్తి అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యమన్నారు. జైలు జీవితం ముగిసి బయటకు వెళ్లిన తర్వాత ప్రతి ఒక్కరూ సమాజంలో ఆరోగ్యకరమైన, నేరరహితమైన గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని, అందుకోసమే ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఎన్‌డీపీఎస్ చట్టం కింద కఠిన శిక్షలు
ముఖ్యంగా వయసు ప్రభావం, చెడు స్నేహాలు లేదా కొన్ని క్లిష్ట పరిస్థితుల వల్ల యువత ఎక్కువగా గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారని ఏసీపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎన్‌డీపీఎస్ యాక్ట్‌పై ఖైదీలకు క్షుణ్ణంగా వివరించారు. మాదకద్రవ్యాలను కలిగి ఉండడం, సేవించడం, ఇతర ప్రాంతాలకు రవాణా లేదా సరఫరా చేయడం, ల్యాబ్‌లలో తయారు చేయడం, క్రయవిక్రయాలు సాగించడం అన్నీ కూడా భారతీయ చట్టాల ప్రకారం అత్యంత కఠినమైన క్రిమినల్‌ నేరాలని.. ఇటువంటి పనులకు పాల్పడితే కోర్టుల ద్వారా దీర్ఘకాలిక శిక్షలు తప్పవని హెచ్చరించారు.
స్వచ్ఛందంగా వస్తే స్వాగతిస్తాం!
ఒకవేళ ఎవరైనా తెలియక మాదకద్రవ్యాలకు అలవాటు పడి, ప్రస్తుతం వాటి నుంచి విముక్తి పొందాలని గట్టి సంకల్పంతో స్వయంగా ముందుకు వస్తే వారిపై ఎలాంటి నేర విచారణా (పోలీస్ కేసులు) ఉండదని ఏసీపీ రమణమూర్తి ఒక మంచి అవకాశాన్ని లబ్ధిదారులకు వివరించారు. అలాంటి వారికి ప్రభుత్వం, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డీ-ఎడిక్షన్ సెంటర్ల ద్వారా ఉచితంగా పటిష్టమైన వైద్య సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ అవగాహన కార్యక్రమంలో జిల్లా జైలు సూపరిండెంట్ శ్రీధర్, టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ భానుప్రకాష్, జైలర్ సక్రూ మరియు జైలు సిబ్బంది, ఖైదీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.