బాణాపురంలో ఏసీబీ దాడి..
రూ.25 వేల లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి పట్టివేత
కాకతీయ ముదిగొండ :ముదిగొండ మండలంలోని బాణాపురం గ్రామంలో ఇంటి నిర్మాణ అనుమతి మంజూరు చేసేందుకు రూ.25 వేల లంచం డిమాండ్ చేసి, స్వీకరిస్తుండగా పంచాయతీ కార్యదర్శి తమ్మిశెట్టి సురేష్ ను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడి సమాచారం మేరకు వల పన్ని దాడి నిర్వహించిన ఏసీబీ అధికారులు, లంచం తీసుకుంటున్న సమయంలోనే కార్యదర్శిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు..

