epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నిర్లక్ష్యం వీడండి.. బూత్ స్థాయికి వెళ్లండి

నిర్లక్ష్యం వీడండి.. బూత్ స్థాయికి వెళ్లండి
ఓటర్ల జాబితా సవరణపై శ్రేణులు దృష్టి పెట్టాలి
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం
టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి
రాయపర్తిలో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో కీలక సమీక్షా సమావేశం

కాకతీయ, రాయపర్తి : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై రాయపర్తి మండలంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి శనివారం ఒక కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీ భవిష్యత్తుకు ఈ ఓటర్ల సవరణ ప్రక్రియ ఎంతో కీలకమని, ఎక్కడ ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు బాధ్యతగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే వారికి భవిష్యత్తులో పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని ఆమె ఇచ్చిన భరోసా కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త నమ్మకాన్ని నింపింది. ఆమె పిలుపునకు స్పందించిన క్యాడర్ అంతా ఒక్కసారిగా అలర్ట్ అయి, తక్షణమే బూత్ స్థాయికి వెళ్లి పనిచేసేందుకు సమాయత్తమవుతున్నారు.

బూత్ లెవెల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలి
ఈ సందర్భంగా హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ.. ఓటర్ల సవరణ ప్రక్రియను ఏమాత్రం తేలికగా తీసుకోకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి ఏజెంట్లు స్థానికంగా ఉండే ప్రభుత్వ బూత్ లెవెల్ అధికారులతో పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకుంటూ.. అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లు ఓటర్ల జాబితాలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, దాన్ని ప్రతి ఒక్కరూ పొందేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకుడు ఓటరుగా నమోదయ్యేలా ప్రత్యేక చొరవ చూపాలని ఝాన్సీ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త తమకు కేటాయించిన పోలింగ్ బూత్ పరిధిలోని ప్రతీ ఇంటిని వ్యక్తిగతంగా సందర్శించాలని, ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా సరిచూసుకుంటూ నిరంతరం స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అనర్హుల ఓట్లను తొలగించడం, కొత్త ఓట్ల నమోదు, తప్పుల సవరణ వంటి అంశాలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. ఈ ముఖ్యమైన సమీక్షా సమావేశంలో రాయపర్తి మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.