epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

దోపిడీ ముఠా అరెస్ట్‌

దోపిడీ ముఠా అరెస్ట్‌
నిందితుల్లో ఆర్ఎస్సై, కానిస్టేబుల్.. 12 మంది రిమాండ్‌
మూడు కార్లు, డమ్మీ చిల్డ్రన్ కరెన్సీ నోట్ల బండిల్స్ స్వాధీనం
బ్లాక్‌ మనీని వైట్‌గా మారుస్తామంటూ బురిడీ
అరెస్టు చేసిన స‌త్తుప‌ల్లి పోలీసులు
వివరాలు వెల్లడించిన ఏసీపీ వసుంధర యాదవ్

కాక‌తీయ‌,ఖ‌మ్మం బ్యూరో : అక్రమ మార్గంలో సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న 12 మంది సభ్యుల అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.17.60 లక్షల నగదు, 2 ఇన్నోవా కార్లు, ఒక ఎర్టిగా కారు, టీవీఎస్ స్కూటీ, పోలీస్ యూనిఫామ్, 16 సెల్‌ఫోన్లు, 80 బండిళ్ల నకిలీ ‘చిల్డ్రన్ బ్యాంక్’ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ ఈ సంచలన కేసు వివరాలను వెల్లడించారు. నిందితుల్లో టీజీఎస్పీ 15వ బెటాలియన్‌కు చెందిన ఆర్ఎస్సై బేరా కేశవరావు, కానిస్టేబుల్ ముల్లగిరి వర్ధన్ ఉండటం గమనార్హం.

4రెట్లు ఇస్తామంటూ ఎర..!

ఏసీపీ తెలిపిసిన వివ‌రాలు ప్ర‌కారం.. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కుర్రా గంగాధర్ రెడ్డి జూన్ 25న సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదుతో ఈ మోసం వెలుగుచూసింది. ఈ ముఠా ప్రధాన సూత్రధారి ఈద చంటిబాబు (ఏ1) విభిన్నమైన సిమ్ కార్డుల ద్వారా అమాయకులకు ఫోన్ చేసేవాడు. తన పేరు మహేందర్ రెడ్డి అని, చంద్రం అని వేర్వేరు పేర్లు చెబుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పరిచయం చేసుకునేవాడు. “నా ఖాతాలో రూ.2 కోట్ల బ్లాక్ మనీ ఉంది, ఐటీ సమస్యల వల్ల దాన్ని వైట్ మనీగా మార్చాలనుకుంటున్నాను. మీరు నాకు రూ.10 లక్షల నగదు ఇస్తే అందుకు బదులుగా మీ ఖాతాలో రూ.40 లక్షలు వేస్తాను. అందులోంచి మీ రూ.10 లక్షలు పోను, మిగిలిన రూ.30 లక్షల్లో మీ కమిషన్ రూ.12 లక్షలు ఉంచుకుని మిగతా రూ.18 లక్షలు నాకు నగదు రూపంలో ఇవ్వాలి” అంటూ ఆశ చూపించేవాడు.

నకిలీ పోలీసులతో ‘దోపిడీ’ నాటకం

ఈ మాటలు నమ్మి బాధితులు డబ్బులు పట్టుకుని ముఠా సభ్యులు చెప్పిన ప్రాంతానికి వచ్చేవారు. అక్కడ చంటిబాబు అనుచరుడు డమ్మీ చిల్డ్రన్ కరెన్సీ నోట్లు ఉన్న బ్యాగుతో సిద్ధంగా ఉండేవాడు. బాధితుడు తెచ్చిన ఒరిజినల్ నగదును లెక్కబెడుతున్న సమయంలో.. ముందే ప్లాన్ చేసుకున్న ప్రకారం ఆర్ఎస్సై, కానిస్టేబుల్‌తో పాటు సివిల్ డ్రస్సులో ఉన్న ముఠా సభ్యులు కార్లలో అక్కడికి చేరుకునేవారు. తాము పోలీసులమని నమ్మించి, “మీరు దొంగనోట్ల వ్యాపారం చేస్తున్నారు.. మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం” అని బాధితులను తీవ్రంగా బెదిరించేవారు. అనుమానం రాకుండా తమ ముఠా మనిషిని కూడా కొడుతూ, బాధితుల వద్ద ఉన్న ఒరిజినల్ నగదును గుంజుకుని కార్లలో పారిపోయేవారు.

పోలీసుల తనిఖీల్లో దొరికిపోయారు

నమ్మకమైన సమాచారం మేరకు బుధవారం ఉదయం సత్తుపల్లి మండలం గంగారంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టి ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు, ఖమ్మం, కర్నూలు, సత్యసాయి జిల్లాలకు చెందిన ఈద చంటిబాబు, ముళ్ళగిరి వర్ధన్ (కానిస్టేబుల్), బేరా కేశవరావు (ఆర్ఎస్సై), మువ్వా సత్యనారాయణ, మారుముడి మధు, గోరంట్ల గౌతమ్ కుమార్, కర్లపూడి నవీన్, నక్కా నాగరాజు, సాగి సుబ్బరాజు, కాపా శ్రీనివాస్, దుడుగురు కురబ గణేష్, ఉపేంద్రం జనార్ధన రాజులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరికి సిమ్ కార్డులు సమకూర్చిన రామాంజనేయులు, రాజు అనే ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని ఏసీపీ వసుంధర యాదవ్ తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.