epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అల్లం, బెల్లం..మార్కెట్ పన్నుకు సున్నం!

అల్లం, బెల్లం..మార్కెట్ పన్నుకు సున్నం!
వరంగల్‌లో 60కి పైగా దుకాణాలు..
అనుమతులున్నవి మాత్రం మూడో, నాలుగో
మిగతాదంతా ‘బ్లాక్’ దందా
బజారు అధికారుల మామూళ్ల మాయాజాలం
ప్రభుత్వ ఆదాయానికి ఏటా లక్షల్లో గండి
సూపర్‌వైజర్ల కనుసన్నల్లోనే ‘వసూళ్ల’ పర్వం

కాక‌తీయ‌, వ‌రంగ‌ల్ ప్ర‌తినిధి : మార్కెట్ కమిటీ పరిధిలోకి రావాల్సిన వ్యాపారాలు ఇప్పుడు అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. వరంగల్ నగరంలో అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ వంటి నిత్యావసర సరుకుల వ్యాపారం ఏటా కోట్ల రూపాయల్లో సాగుతోంది. అయితే, నిబంధనల ప్రకారం లైసెన్సులు పొందాల్సిన దుకాణాలు మాత్రం వేళ్లపై లెక్కపెట్టే అంత మాత్రమే ఉన్నాయి. మిగిలిన వ్యాపారమంతా అధికారుల మామూళ్ల మత్తులో ‘బ్లాక్’గా సాగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఖజానాకు అందాల్సిన లక్షలాది రూపాయల ఆదాయం, కొందరు బజారు అధికారుల జేబుల్లోకి వెళ్తోంది.

నగరంలో 60కి పైగా దుకాణాలు.. లైసెన్సులేవి?
వరంగల్ నగరంలో అల్లం, వెల్లుల్లి, ఆలుగడ్డ వంటి సరుకుల వ్యాపారం చేసే దుకాణాలు 60కి పైగా ఉంటాయని అంచనా. మార్కెట్ శాఖ నిబంధనల ప్రకారం ప్రతి దుకాణం లైసెన్సు పొందాలి, సరుకు దిగుమతిపై పన్ను చెల్లించాలి. కానీ, రికార్డులను పరిశీలిస్తే కేవలం మూడు, నాలుగు దుకాణాలకు మాత్రమే అనుమతులు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే, మిగిలిన 50కి పైగా దుకాణాలు ఎటువంటి లైసెన్సులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. పాత బీటుబజారు ఒక్కచోటే 20కి పైగా దుకాణాలు ఉండగా, ప్రతి రోజూ ఒక్కో లారీ సరుకు దిగుమతి అవుతోంది. ఈ లెక్కన నెలకు వందల లారీల సరుకు మార్కెట్ పన్ను కట్టకుండానే దర్జాగా విక్రయించబడుతోంది.

బజారు అధికారుల మామూళ్ల మాయాజాలం
ఈ అక్రమ దందా అంతా బజారు అధికారుల కనుసన్నల్లోనే సాగుతోంది. వ్యాపారాలను పర్యవేక్షించి, పన్ను వసూలు చేయాల్సిన బాధ్యత మార్కెట్ శాఖకు చెందిన సూపర్‌వైజర్లది. కానీ, వారు బాధ్యతలను పక్కనపెట్టి వ్యాపారుల నుంచి ‘నెలవారీ మామూళ్లు’ వసూలు చేయడానికే ప్రాధాన్యమిస్తున్నారు. పదవీ విరమణ పొందిన సూపర్వైజర్ నుండి ప్రస్తుత అధికారి వరకు ఇదే తంతు కొనసాగుతోంది. కొన్నేళ్లుగా ఒకే అధికారిని ఈ విధుల్లో ఉంచడం వెనుక ఉన్న మర్మం ఏంటో అర్థం చేసుకోవచ్చు. సదరు అధికారులు ఆయా వ్యాపార లావాదేవీలను లెక్కగట్టి ప్రభుత్వానికి జమ చేయాల్సింది పోయి, తమ జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వ ఆదాయానికి ఏటా లక్షల్లో గండి
ప్రభుత్వానికి రావాల్సిన మార్కెట్ ఫీజు ఎగ్గొట్టడం ద్వారా ఖజానాకు ఏటా లక్షలాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఒకేసారి లారీ లోడు దిగుమతి చేసుకునే దుకాణాల నుంచి వసూలు చేయాల్సిన పన్నును మాయం చేసి, వ్యాపారుల నుంచి తక్కువ మొత్తాన్ని మామూళ్ల రూపంలో తీసుకోవడం ద్వారా మార్కెట్ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతోంది. పక్కా రికార్డులు ఉంటే ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది, కానీ రికార్డులన్నీ అక్రమాలకు అనుగుణంగా మార్చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అక్రమాలపై విచారణ చేపట్టాలి
నిబంధనలను గాలికి వదిలేసి, ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతున్న అధికారులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. వరంగల్ నగరంలోని అక్రమ దుకాణాలన్నింటినీ గుర్తించి, తక్షణమే లైసెన్సు ప్రక్రియ చేపట్టాలని, అక్రమాలకు సహకరిస్తున్న బజారు అధికారుల తీరుపై విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజల సొమ్మును స్వాహా చేస్తున్న అక్రమార్కుల భరతం పట్టకపోతే, ప్రభుత్వ ఖజానాకు మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.