epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

హెచ్చార్సీ పిటిషన్ ఎవరి మెడకు?!

హెచ్చార్సీ పిటిషన్ ఎవరి మెడకు?!
ఇసుక దందాలో క‌ల‌క‌లం రేపుతున్న భాస్క‌ర్‌రావు ఫిర్యాదు
ఇరకాటంలో ములుగు జిల్లా అధికార పార్టీ నేతలు
సబ్ కాంట్రాక్టర్ ఫిర్యాదుతో ములుగు జిల్లాలో రాజకీయ వేడి
కేసులు, దర్యాప్తు నేపథ్యంలో పోలీసుల అడుగులు కీలకం
అనుచ‌రుల తీరుపై మంత్రి సీతక్క ఆగ్రహం.. స్థానిక నేతలపై ఆరా?
బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేటీఆర్ సమాలోచనలు?!
గులాబీ పార్టీకి రాజ‌కీయ అవ‌కాశం..అస్త్రంగా మారిన అంశం

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : ములుగు జిల్లాలోని చుంచుపల్లి ఇసుక రీచుల వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఇసుక దందాను ఆసరా చేసుకుని అధికార పార్టీ నేతలు చేస్తున్న అరాచకాలపై నిప్పులు చెరుగుతున్న ప్రతిపక్షాలకు, సబ్ కాంట్రాక్టర్ బెల్లంకొండ వెంకటేశ్వర్ రావు అలియాస్ భాస్కర్ రావు వేసిన హెచ్‌ఆర్‌సీ పిటిషన్ ఒక అస్త్రంగా దొరికింది. సొంత పార్టీలోనే ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరగడం, మంత్రి సీతక్క ఈ ఇసుక వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జిల్లా రాజకీయాల్లో పెను ప్రకంపనలకు దారితీస్తోంది. ములుగు జిల్లా చుంచుపల్లి ఇసుక రీచుల విషయంలో సబ్ కాంట్రాక్టర్ బెల్లంకొండ వెంకటేశ్వర్ రావు అలియాస్ భాస్కర్ రావు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించడం సంచలనంగా మారింది. చుంచుపల్లి గ్రామానికి చెందిన సొసైటీల అధ్యక్షుడు కోరం అబ్బయ్య, కార్తీక్, డీసీసీ అధ్యక్షుడు అశోక్, మరో వ్యక్తి కొండం బాలకృష్ణ, ములుగు ఎస్పీ, పస్రా సీఐ, మంగపేట ఎస్సైలను ప్రతివాదులుగా చేరుస్తూ భాస్క‌ర్‌రావు హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేశారు. అయితే హెచ్‌ఆర్‌సీ నుంచి నోటీసులు వచ్చిన తర్వాత పోలీసులు ఈ విషయంపై లోతుగా దర్యాప్తు చేసే అవకాశాలు ఉండటంతో, సంబంధిత‌ అధికార పార్టీ నేతల్లో టెన్ష‌న్ మొద‌లైన‌ట్లు స‌మాచారం.

       సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న ఫొటో..

ఆధారాలతో ఫిర్యాదు… పోలీసులకు చిక్కులు..
డయాలసిస్ పేషెంట్ అయిన భాస్కర్ రావు వద్ద ఆధారాలేమీ లేవని అనుకున్న వారికి, ఇప్పుడు ఆయన వద్ద ఉన్న ఆధారాలు మింగుడుపడకుండా తయారవుతున్నాయి. అగ్రిమెంట్ ప్రకారం సబ్ కాంట్రాక్ట్ ఇవ్వకపోవడానికి డీసీసీ అధ్యక్షుడు అశోకే కారణమని, అంతా ఆయనే చూసుకుంటున్నాడని చుంచుపల్లి గ్రామ ట్రైబల్ సొసైటీ ప్రతినిధి చెప్పిన మాటలకు సంబంధించిన ఆడియో రికార్డులను భాస్కర్ రావు సిద్ధం చేసుకున్న‌ట్లు స‌మాచారం. ఇప్పటికే అగ్రిమెంట్ పత్రాలను దాఖలు చేసిన ఆయన తాజాగా సేకరించిన ఆడియో రికార్డులను కూడా హెచ్‌ఆర్‌సీకి, ములుగు జిల్లా ఎస్పీకి అందజేయడానికి సిద్ధమవుతున్న‌ట్లు తెలుస్తోంది. పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి హెచ్‌ఆర్‌సీకి నివేదిక ఇస్తే, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని, దీంతో అధికార పార్టీ నేతలు ఇరకాటంలో పడటం ఖాయమన్న విశ్లేష‌ణ రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య సాగుతుండ‌టం గ‌మ‌నార్హం.

కేటీఆర్ వ్యూహం.. సీత‌క్క అస‌హ‌నం..
అధికార పార్టీ నేతలుగా చెలాయిస్తున్న వారే ఇసుక దందా వెనుక ఉండి నడిపిస్తున్నారని ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న తరుణంలో, భాస్కర్ రావు ఫిర్యాదు ఆ ఆరోపణలకు బలాన్ని చేకూర్చింది. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ములుగు జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. ములుగు జిల్లా ఇసుక రీచ్‌ల కేటాయింపులు.. ఇత‌రాత్ర వ్య‌వ‌హారాల‌పై ఆరోపణలు గుప్పిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి, భాస్కర్ రావు అంశం రాజకీయంగా కలిసి వచ్చిందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. మరోవైపు భాస్కర్ రావు వ్యవహారం మీడియాలో కథనాలుగా రావడంతో మంత్రి సీతక్క సీరియస్ అయ్యారని సమాచారం. ఇసుక వ్యవహారంలో సొంత పార్టీ నేతలు తలదూర్చి, ఇంతటి వివాదానికి కారణం కావడంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి ఈ వ్యవహారంపై ఆమె పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. మంత్రి ఆగ్రహంతో ఇప్పుడు స్థానిక నేతల్లో వణుకు మొదలైంది.

ఎవరి మెడకు చుట్టుకోనుందో?
ములుగు జిల్లాలో ఇసుక దందా అనేది కేవలం ఒక ఆర్థిక వ్యవహారం మాత్రమే కాకుండా అది రాజకీయ పలుకుబడికి నిదర్శనంగా మారింది. అధికార పార్టీ నేతలే తెరవెనుక ఉండి సొసైటీలను, అగ్రిమెంట్లను ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణలు ఇప్పుడు హెచ్‌ఆర్‌సీ వేదికగా చట్టబద్ధమైన విచారణకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా పోలీసు అధికారులను కూడా ప్రతివాదులుగా చేర్చడం వెనుక, కేవలం ఇసుక దందానే కాకుండా పరిపాలనా యంత్రాంగంపై కూడా ప్రభావం ఉందన్నది స్పష్టమవుతోంది. మంత్రి సీతక్క ఆగ్రహం ఒకవైపు, ప్రతిపక్షం బీఆర్ఎస్ వ్యూహాత్మక పావులు మరొకవైపు ఉండటంతో, ఈ హెచ్‌ఆర్‌సీ పిటిషన్ ఎవరి మెడకు చుట్టుకుంటుందో అన్నది ములుగు రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత ఉత్కంఠ రేపుతోంది. దర్యాప్తు గనుక నిజాయితీగా సాగితే, ములుగు ఇసుక దందా వెనుక ఉన్న అసలు బండారం బయటపడటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన

విద్వేషం, విధ్వంస విధానాలతో కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ ప్రజల సమస్యలు,...

ఎర్రవల్లిలో ఉద్రిక్తత

ఎర్రవల్లిలో ఉద్రిక్తత కేసీఆర్ ఫాం హౌస్‌కు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌...

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం

హామీలపై కాంగ్రెస్‌ను ఎండగడతాం అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను మోసం చేసింది వంద...

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా?

ఇదేం అసెంబ్లీ.. కౌరవ సభా.. పోలీసు రాజ్యమా? మహిళా శాసనసభ్యుల చీరెలు లాగుతారా.....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.