కొమ్మాలలో వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ
ఉత్సవంలో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి దంపతులు
కాకతీయ,గీసుగొండ : కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని ఆధ్యాత్మిక శోభతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.మండలంలోని కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో శిథిలావస్థకు చేరిన పాత ధ్వజస్తంభం స్థానంలో జూలై 2 నుంచి 5వ తేదీ వరకు వేదశాస్త్రోక్తంగా యాగాలు,హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దేవనాని రామానుజ జీయర్ స్వామివారి దివ్య సాన్నిధ్యంలో నూతన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఈ మహోత్సవంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, సునంద దంపతులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి వేదపండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు.రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు,ఆయురారోగ్యాలు,ఐశ్వర్యాలతో ఉండాలని ప్రార్థించిన ఎమ్మెల్యే దంపతులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రసాద్,ఆలయ ప్రధాన అర్చకులు కాండూరి రామాచార్యులు,విష్ణుచారి, ఫణీంద్రచారి, ఊకల్ శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవాలయ ప్రధాన అర్చకులు సుదర్శనాచార్యులు,శ్రీహర్ష, కొమ్మాల సర్పంచ్ యమునా–ప్రవీణ్ దంపతులు, సూర్యతండా సర్పంచ్ రాఘవేంద్ర, అంకతి నాగేశ్వరరావు,విరాటి లింగా రెడ్డి,సాయిలి ప్రభాకర్, పుర ప్రముఖులు, గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

