epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మంత్రి అండతోనే పైడాకుల ఆగ‌డాలు

మంత్రి అండతోనే పైడాకుల ఆగ‌డాలు
డీసీసీ అధ్య‌క్షుడు అశోక్‌కు ర‌క్ష‌ణ క‌వ‌చంగా మంత్రి సీత‌క్క‌
రూ.38 లక్షలు తీసుకుని ఇసుక కాంట్రాక్ట‌ర్‌కు వేధింపులు
మంత్రి సీత‌క్క‌ అనుచ‌రుల పేరుతో ములుగు జిల్లాలో అరాచ‌కాలు
భాస్కర్ రావుకు ప్ర‌భుత్వం రక్షణ కల్పించాలి
బీజేపీ కిసాన్ మోర్చా ములుగు జిల్లా అధ్యక్షుడు డా. జాడి రామరాజు నేత

కాక‌తీయ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : మంత్రి సీత‌క్క అండ‌తోనే ములుగు డీసీసీ అధ్య‌క్షుడు పైడాకుల ఆగ‌డాలు పెరిగిపోతున్నాయ‌ని బీజేపీ కిసాన్ మోర్చా ములుగు జిల్లా అధ్యక్షుడు డా. జాడి రామరాజు నేత ధ్వ‌జ‌మెత్తారు. మంత్రి అనుచ‌రులుగా చెలామ‌ణి అవుతున్న కొంత‌మంది లీడ‌ర్లు అరాచకాలకు పాల్పడుతున్నారని విమ‌ర్శించారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలో డా. జాడి రామరాజు నేత విలేక‌రుల‌తో మాట్లాడుతూ ఇసుక క్వారీ ఇప్పిస్తాన‌ని చెప్పి సబ్ కాంట్రాక్టర్ భాస్కర్ రావు వద్ద నుంచి రూ. 38 లక్షలు తీసుకుని మోసం చేసిన మాట వాస్త‌వ‌మ‌ని అన్నారు. ప్రస్తుతం అతన్ని తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. అశోక్ చేస్తున్న అవినీతి, అక్రమాలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మంత్రి సీత‌క్క ర‌క్ష‌ణ‌గా ఉండ‌టం స‌రైంది కాద‌ని అన్నారు. ఒకప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇసుక మాఫియాపై మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోరాటం చేసిన సీత‌క్క‌, ఇప్పుడు అదే మాఫియాకు కొమ్ముకాస్తూ ఆర్థిక ప్రయోజనాలు పొందే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లుగా అర్థ‌మ‌వుతోంద‌న్నారు.ఇసుక స‌బ్ కాంట్రాక్ట‌ర్ భాస్కర్ రావు నుంచి తీసుకున్న రూ. 38 లక్షలను డీసీసీ అధ్యక్షుడు అశోక్ వెంటనే తిరిగి ఇచ్చేలా చూడాలని, బాధితుడికి తగిన రక్షణ కల్పించాలని డా. జాడి రామరాజు నేత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ఇటువంటి అక్రమ, అరాచక పాలనపై స్థానిక ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని రామరాజు హెచ్చరించారు.

రైతులపై ప్రభుత్వం నిర్లక్ష్యం..!

జిల్లాలో 84,674 మంది రైతులు ఉండగా, కేవలం 62,544 మందికే రైతుబంధు అందిందని, మిగిలిన 22,400 మంది రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రైతుల డబ్బులు చెల్లించకుండా, ప్రజల చేత తనకే పాలాభిషేకం చేయించుకుంటూ మంత్రి “రాక్షసానందం” పొందుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి రూ. 15,000 ఇస్తామని చెప్పి, ఇప్పుడు రూ. 12,000 ఇచ్చి రైతులను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏజెన్సీ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటూ కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే మంత్రి తాపత్రయపడుతున్నారని ఆరోపించారు. 2024 మార్చిలో కొండాయి బ్రిడ్జికి శంకుస్థాపన చేసినా, ఇప్పటివరకు అది పూర్తి కాలేదని గుర్తు చేశారు. ఇసుక మాఫియా అక్రమాలను కప్పిపుచ్చడానికే ఏటూరునాగారం రెవెన్యూ డివిజన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, మంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే డివిజన్‌ను వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..!

వాస్తవాలు రాస్తే ఉక్రోషం..! నాపై వార్తలు రాసిన వాళ్లపై కేసులు పెట్టండి ‘కాకతీయ’ స్టాఫర్‌పై...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

మా కుటుంబాన్ని వేధించొద్దు

మా కుటుంబాన్ని వేధించొద్దు సుమంత్ విష‌యంలో వాస్తవాలను ప‌రిశీలించండి 20 రోజులుగా మా కుటుంబంపై...

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.