epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నారుమళ్లకూ నీళ్లు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం

  • కాళేశ్వరంపై దుష్ప్రచారంతోనే అధికారంలోకి కాంగ్రెస్
  • సాగునీటి అవసరాలను పూర్తిగా విస్మరించిన ప్రభుత్వం
  • పాకాల, రంగయ్య చెరువు మోటార్లు వెంటనే ప్రారంభించాలి
  • ప్రభుత్వం స్పందించకపోతే రైతుల ప్రత్యక్ష పోరాటం
  • మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి హెచ్చరిక
  • స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిపై తీవ్ర విమర్శలు

కాకతీయ, ఖానాపూర్ : కాలేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు రైతుల సాగునీటి అవసరాలను పూర్తిగా విస్మరించిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఖానాపురం మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గోదావరిలో సమృద్ధిగా నీరు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
రైతుల కోసం నీళ్లు అడిగితే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనుచిత భాషలో మాట్లాడుతున్నారని సుదర్శన్‌రెడ్డి మండిపడ్డారు. రిటైర్డ్ ఇంజినీర్లు, మేధావులను అవమానించే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు. తన హయాంలో రామప్ప, పాకాల, రంగయ్య చెరువు ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చి వేలాది ఎకరాలకు సాగునీరు అందించామని, ఇప్పుడు కనీసం నారుమళ్లకు కూడా నీళ్లు అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వంపై పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆగ్రహం
ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ముందే హెచ్చరించినా ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పాకాలలో నీటి మట్టం తక్కువగా ఉన్నప్పటికీ నారుమళ్లకు నీరు అందించామని గుర్తు చేశారు. దేవాదుల, సమ్మక్క బ్యారేజీ వద్ద భారీగా నీటి ప్రవాహం ఉన్నా, ప్రభుత్వ అసమర్థత కారణంగా రైతులు కరువు కష్టాలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రామప్ప చెరువులో 26 అడుగుల నీరు ఉన్నా, పాకాల ప్రాజెక్టు మోటార్లు ఎందుకు నడపడం లేదని ఆయన ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే ఇప్పటివరకు ప్రాజెక్టులను సందర్శించలేదని, కనీసం అధికారులతో సమీక్ష కూడా నిర్వహించలేదని సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. నార్లు వేసే సమయం ముగిసిపోతున్నందున, రేపటి నుంచే పాకాల, రంగయ్య చెరువు ప్రాజెక్టుల మోటార్లను ప్రారంభించి రైతులకు నీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులు ప్రభుత్వంపై, స్థానిక ఎమ్మెల్యేపై ప్రత్యక్ష పోరాటాలు చేపడతారని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ మండల స్థాయి నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.