epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

సజీవ దహనం హత్య కేసులో ఏడుగురి అరెస్టు

సజీవ దహనం హత్య కేసులో ఏడుగురి అరెస్టు
ప్రధాన నిందితుడితో పాటు మరో ఆరుగురికి జ్యుడీషియల్ రిమాండ్
పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు
ఎన్. శ్వేత, వరంగల్ పోలీస్ కమిషనర్

కాకతీయ, వరంగల్ బ్యూరో: ఎనుమాములలో వ్యక్తిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసి హత్య చేసిన సంచలన కేసును వరంగల్ పోలీసులు వేగంగా ఛేదించి ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడితో పాటు మరో ఆరుగురిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించగా, పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత తెలిపారు. కేసును త్వరితగతిన పూర్తి చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎనుమాముల ఎన్‌టీఆర్ నగర్‌కు చెందిన అడుపు మహేష్‌పై ప్రధాన నిందితుడు పట్టి కుమారస్వామి అలియాస్ కుమార్ పాత కక్ష పెంచుకున్నాడు. గతంలో హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించి బెయిల్‌పై బయటకు వచ్చిన కుమారస్వామి, తనపై తప్పుడు ప్రచారం చేస్తూ స్థానిక ప్రజాప్రతినిధి వద్ద రాజకీయంగా నష్టం కలిగిస్తున్నాడనే అనుమానంతో మహేష్‌ను హత్య చేయాలని కుట్ర పన్నాడు. ఈ కుట్రలో గంధం నరేష్, జన్ను మధు, పిట్ల శ్రీనివాస్ అలియాస్ బండి శ్రీను, సురేష్ (పరారీలో), లాసాని రాంసాయి, టోని సంజయ్య, పోతారం శివకుమార్ పాల్గొన్నారు.

ప్రత్యేక బృందాలతో కేసు ఛేదించిన పోలీసులు

ఈ నెల 18వ తేదీ రాత్రి పరిమళ కాలనీ రోడ్డు నంబర్-2 వద్ద మహేష్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో తీవ్రంగా గాయపడిన ఆయన చికిత్స పొందుతూ జూలై 19న మృతి చెందాడు. మృతుడి భార్య అడుపు నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు గీసుగొండ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 237/2026గా భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు అధికారి విశ్వేశ్వర్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు సాంకేతిక ఆధారాలు, ఇతర సమాచారంతో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోందని సీపీ ఎన్. శ్వేత తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన మామునూరు ఏసీపీ వెంకట్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, దర్యాప్తు అధికారి విశ్వేశ్వర్, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్లు బాబులాల్, సుబ్బారెడ్డి, దేవేందర్, శ్రీధర్‌తో పాటు గీసుగొండ పోలీస్ స్టేషన్, టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని ఆమె అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారు కాంగ్రెస్ పెద్ద‌వంగ‌ర‌ మండల...

రజకులు ఐక్యంగా హక్కుల సాధనకు కృషి చేయాలి

రజకులు ఐక్యంగా హక్కుల సాధనకు కృషి చేయాలి రజక సంఘం ఏటూరునాగారం మండ‌ల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.