epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

స్క్రాప్ నెట్‌వర్క్ మాఫియా..

స్క్రాప్ నెట్‌వర్క్ మాఫియా..
మణుగూరు టు విజయవాడ వరకు విస్త‌ర‌ణ‌
3వేల కేజీల కాపర్‌లో 300 కేజీలే స్వాధీనం?
మిగతా 2,700 కేజీల ఆచూకీ ఎక్కడ..?
కొనుగోలు వ్య‌వ‌హారంపై ద‌ర్యాప్తు స‌గంలోనే ఆగిపోయిందా..?
బీటీపీఎస్, సింగరేణి కేసులతోనూ సంబంధాల‌పై ప్ర‌శ్న‌లు

కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి: మణుగూరులో వెలుగులోకి వచ్చిన కాపర్ దొంగతనం కేసు క్రమంగా జిల్లాల సరిహద్దులు దాటి మణుగూరు–విజయవాడ స్క్రాప్ నెట్‌వర్క్ వైపు దర్యాప్తు మళ్లాల్సిన అవసరం ఉందనే చర్చ పెరుగుతోంది. దొంగతనాలకు పాల్పడిన యువకుల అరెస్టులతో కేసు ఒక దశకు చేరుకున్నప్పటికీ, దొంగిలించిన కాపర్ ఎవరికి విక్రయించబడింది, ఏ మార్గంలో తరలించబడింది, చివరకు ఎక్కడికి చేరింది అనే ప్రశ్నలు మాత్రం ఇంకా సమాధానం కోసం ఎదురుచూస్తున్నాయి. దర్యాప్తు పూర్తిగా కొనుగోలు గొలుసుపైకి వెళ్లకపోతే ఈ కేసులోని అసలు నెట్‌వర్క్ వెలుగులోకి రాదని స్థానికంగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తులో బయటకు వచ్చిన వివరాల ప్రకారం దొంగతనాల పరిమాణం సుమారు 3,000 కిలోల కాపర్ వరకు ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడైన పరిమాణం 300 కిలోలకే పరిమితమైందన్న సమాచారం చర్చకు దారితీసింది. దీంతో మిగిలిన 2,700 కిలోల కాపర్ ఎక్కడ ఉంది? అనే ప్రశ్న సహజంగానే ముందుకు వస్తోంది. ఆ సరుకు ఇంకా ఎక్కడైనా నిల్వ ఉందా? ఇప్పటికే స్క్రాప్ యార్డుల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించబడిందా? లేక దర్యాప్తు కొనసాగుతున్నందున ఇంకా స్వాధీనం చేయాల్సి ఉందా? అనే అంశాలపై పోలీసులు అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉందని స్థానికులు కోరుతున్నారు.

కొనుగోళ్ల వ్య‌వ‌హార‌మే అసలు కీలకమా..?

దొంగతనం జరిగిన తర్వాత దొంగిలించిన కాపర్ మార్కెట్‌కు చేరకుండా ఉండడం సాధ్యం కాదని స్క్రాప్ వ్యాపార వర్గాలే చెబుతున్నాయి. అలాంటప్పుడు ఆ కాపర్‌ను ఎవరు కొనుగోలు చేశారు? ఎక్కడ నిల్వ చేశారు? తర్వాత ఎక్కడ విక్రయించారు? అనే అంశాలే ఈ కేసులో కీలకంగా మారాయి. దొంగిలించిన సరుకును కొనుగోలు చేసిన వారి పాత్ర, ఆర్థిక లావాదేవీలు, రవాణా మార్గాలు, డిజిటల్ చెల్లింపులు వంటి అంశాలను పూర్తిగా పరిశీలిస్తేనే అసలు నెట్‌వర్క్ బయటపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. నేరంలో పాల్గొన్నవారితో పాటు నేరం ద్వారా లాభం పొందినవారి పాత్రను కూడా సమానంగా పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ కేసులో విజయవాడకు సంబంధించిన స్క్రాప్ వ్యాపార సంబంధాలపై స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఆ కోణంలో దర్యాప్తు ఎంతవరకు సాగింది? సంబంధిత వ్యక్తుల నుంచి వివరాలు సేకరించారా? సరుకు రవాణా వివరాలను పరిశీలించారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంతర్‌జిల్లా స్క్రాప్ నెట్‌వర్క్ ఉన్నట్లు తేలితే, ఒకే జిల్లాలోని దర్యాప్తుతో కేసు పూర్తి కావడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవసరమైతే ఇతర జిల్లాల పోలీసులతో సమన్వయం చేసి మొత్తం సరుకు మార్గాన్ని గుర్తించాలని పలువురు సూచిస్తున్నారు.

పాత కేసులతో పోలికలు

గతంలో బీటీపీఎస్, సింగరేణి పరిధిలో నమోదైన స్క్రాప్, కాపర్ దొంగతనాల కేసులను కూడా ఈ కేసుతో పోల్చి పరిశీలించాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. గతంలో స్వాధీనం చేసుకున్న సరుకు, అప్పటి నిందితులు, ప్రస్తుతం బయటకు వస్తున్న వివరాల మధ్య ఏమైనా సంబంధం ఉందా అనే అంశాన్ని కూడా పోలీసులు పరిశీలించాలని సూచిస్తున్నారు. అయితే ఈ కేసుల మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ వెలువడలేదు. ఈ కేసులో ఇప్పటికీ సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు చాలానే ఉన్నాయి. 2,700 కిలోల కాపర్ ఆచూకీ, కొనుగోలు చేసిన వారి పాత్ర, స్క్రాప్ యార్డుల ద్వారా జరిగిన సరుకు చలామణి, డిజిటల్ లావాదేవీలు, ఇతర జిల్లాలతో సంబంధాలు వంటి అంశాలపై సమగ్ర దర్యాప్తు జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రజల్లో వినిపిస్తున్న ప్రధాన డిమాండ్ ఒక్కటే… అరెస్టులతోనే కేసు ముగిసిందనే భావన కలగకుండా, దొంగతనం నుంచి కొనుగోలు, రవాణా, విక్రయం వరకు మొత్తం స్క్రాప్ నెట్‌వర్క్‌ను ఛేదించేలా దర్యాప్తు ముందుకు సాగాలి. అప్పుడే మిగిలిన కాపర్ ఆచూకీతో పాటు కేసులోని అన్ని కోణాలపైనా స్పష్టత వచ్చే అవకాశముందని వారు అభిప్రాయపడుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.