- క్లబ్ జిల్లా గవర్నర్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం
కాకతీయ, చేర్యాల : లయన్స్ క్లబ్ ఆఫ్ చేర్యాల జూలై నెలలో చేపట్టిన విశిష్ట సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా జిల్లా గవర్నర్ లయన్ ఎన్. సుధాకర్ రెడ్డి చెరియల్ లయన్స్ క్లబ్‌ను జిల్లాలోనే ‘బెస్ట్ క్లబ్’ గా ఎంపిక చేశారు.ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు లయన్ డా. వి. సత్యనారాయణ, కార్యదర్శి లయన్ ధర్మరాజ్, కోశాధికారి లయన్ బంగారం కొండయ్యలకు అవార్డులు ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో లయన్ టి. వెంకట్ రెడ్డి తో పాటు పలువురు మాజీ జిల్లా గవర్నర్లు పాల్గొని క్లబ్ సభ్యులను అభినందించారు.జూలై నెలలో చెరియల్ లయన్స్ క్లబ్ చేపట్టిన సేవా కార్యక్రమాల్లో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ, చేరియల్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు రంగులు వేయించడం, ప్రజల సౌకర్యార్థం బస్టాండ్ నిర్మాణం వంటి సేవా కార్యక్రమాలు ప్రధానంగా నిలిచాయి. సమాజ సేవలో చెరియల్ లయన్స్ క్లబ్ చూపుతున్న చొరవకు ఈ అవార్డు నిదర్శనమని సభ్యులు పేర్కొన్నారు.

