epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చెరిగిపోని ఉద్యమ ముద్ర… పెద్ది

చెరిగిపోని ఉద్యమ ముద్ర… పెద్ది

కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఉద్యమ చరిత్రలో కొన్ని పేర్లు కాలగర్భంలో కలిసిపోవు. పోరాటం గురించి మాట్లాడినప్పుడల్లా, ఉద్యమ జెండా రెపరెపలాడినప్పుడల్లా గుర్తుకొచ్చే నాయకుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఒకరు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిన రోజుల్లో ఆయన పేరు ఒక వ్యక్తిని మాత్రమే సూచించేది కాదు… ఉద్యమానికే ప్రతీకగా మారింది. రాస్తారోకో అయినా, బంద్ అయినా, దీక్ష అయినా, జైలు భరో కార్యక్రమం అయినా… ముందుండేది పెద్ది. ఉద్యమం ఎక్కడ ఉంటే అక్కడ ఆయన కనిపించేవారు. అందుకే ఉద్యమ సహచరులు ప్రేమగా “ఉద్యమంలో సకలం అతనే” అని చెప్పుకునేవారు.

      

కేసీఆర్‌కు నమ్మకమైన ఉద్యమ సహచరుడు

పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కేసీఆర్ వెంట నీడలా నడిచిన నాయకుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఒకరు. ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా దాదాపు 8 సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించడం ఆయనపై పార్టీ అధినేతకు ఉన్న విశ్వాసానికి నిదర్శనం. ఉద్యమ వ్యూహాల అమలు నుంచి గ్రామస్థాయి పార్టీ నిర్మాణం వరకు కేసీఆర్ అప్పగించిన ప్రతి బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించారు. ఉద్యమంలో వరంగల్ జిల్లాకు సంబంధించిన ప్రతి కీలక పరిణామంలో పెద్ది పాత్ర ఉండేదని పార్టీ నాయకులు గుర్తుచేసుకుంటున్నారు.

 

ఉద్యమకారులకు పెద్ద దిక్కు

తెలంగాణ ఉద్యమం కేవలం సభలు, సమావేశాలతో ముందుకు సాగలేదు. వేలాది మంది కార్యకర్తల త్యాగాలు, అంకితభావంతో బలపడింది. ఆ కార్యకర్తలకు ధైర్యం చెప్పే పెద్దన్నగా పెద్ది సుదర్శన్ రెడ్డి నిలిచారు. ఎక్కడ ఉద్యమకారులపై కేసులు నమోదైనా, ఎక్కడ అరెస్టులు జరిగినా, ఎక్కడ నిరసనలు జరిగినా ముందుగా చేరేది ఆయనే. ఉద్యమంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్యకర్తలకు అండగా నిలిచి, వారిలో ధైర్యం నింపిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది.

కనకనలాడిన ఉద్యమ జ్వాల

తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా సాగిన ప్రతి దశలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. పోలీసులు కేసులు పెట్టినా, నాన్-బెయిలబుల్ కేసులతో వేధించినా, జైలు నిర్బంధాలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. ఉద్యమమే తన శ్వాసగా, తెలంగాణే తన లక్ష్యంగా భావించి చివరి వరకు పోరాట పంథాను వీడలేదు. అందుకే ఉద్యమ కాలమంతా కనకనలాడిన జ్వాలగా పెద్ది పేరు తెలంగాణ చరిత్రలో చెరిగిపోని ముద్రగా నిలిచిపోయింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కామారం భూభాగంపై పూర్తి ఆధారాలు

కామారం భూభాగంపై పూర్తి ఆధారాలు 146వ సర్వే ప్రకారం ఆధారాలు మా వద్దే...

మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా వల్లాల సదానందం గౌడ్

మోకుదెబ్బ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా వల్లాల సదానందం గౌడ్ కాకతీయ, హనుమకొండ :...

ఏళ్లు గడుస్తున్నా…మూత్రశాలలు ఏవి సామీ?

ఏళ్లు గడుస్తున్నా...మూత్రశాలలు ఏవి సామీ? తీరని బస్ స్టాండ్  కష్టాలు.. చోద్యం చూస్తున్న ఆర్టీసీ,పంచాయతీ...

అనారోగ్యంతో విలేకరి ఐలయ్య మృతి

అనారోగ్యంతో విలేకరి ఐలయ్య మృతి కాకతీయ, పెద్దవంగర : మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర...

నవోదయలో 9, 11 తరగతులకు ప్రవేశాలు

నవోదయలో 9, 11 తరగతులకు ప్రవేశాలు సెప్టెంబర్‌ 30లోగా ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఏప్రిల్‌ 10,...

ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలం

ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలం ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి జాబ్‌ క్యాలెండర్‌తో...

మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు తప్పవు

మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు తప్పవు మైనర్‌ డ్రైవర్లపై కాజీపేట ట్రాఫిక్‌ పోలీసుల...

ఫిన్లాండ్‌ ఎక్స్‌పోజర్‌ విజిట్‌కు అంజుమ్‌ సుల్తానా ఎంపిక

ఫిన్లాండ్‌ ఎక్స్‌పోజర్‌ విజిట్‌కు అంజుమ్‌ సుల్తానా ఎంపిక వినూత్న బోధనా పద్ధతులపై అధ్యయనం సాంకేతికత,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.