భద్రాచలం వద్ద 43 అడుగులకు చేరిన గోదావరి…మొదటి ప్రమాద హెచ్చరిక…
సాయంత్రానికి రెండో హెచ్చరిక అవకాశం… వరద ఉధృతి కొనసాగింపు…
48 అడుగులు దాటితే రెండో, 53 అడుగులు దాటితే మూడో హెచ్చరిక…
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన…
కాకతీయ,కొత్తగూడెం ప్రతినిధి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం బుధవారం 43 అడుగులకు చేరుకుంది.దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నీటిమట్టం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో సాయంత్రానికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. నీటిమట్టం 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఇప్పటికే నది తీర ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ఎవరూ నది వైపు వెళ్లవద్దని,సురక్షిత ప్రాంతాలకు తరలేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించారు.

