ఇద్దరు యువకులు డీ-అడిక్షన్ సెంటర్‌కు
కాకతీయ, నెల్లికుదురు: గంజాయి సేవించిన ఇద్దరు యువకులను పట్టుకుని కోర్టు ఆదేశాల మేరకు డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించినట్లు ఎస్సై చిర్ర రమేష్‌బాబు తెలిపారు. బుధవారం దుర్గాభవాని తండా క్రాస్‌రోడ్డు సమీపంలోని ఐకేపీ కేంద్రంలో ఇద్దరు యువకులు గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి నిర్వహించారు. దిడ్డి కార్తీక్ (ఆలేరు), బాదావత్ మోహన్ (కేవుల తండా)లను అదుపులోకి తీసుకుని గంజాయి టెస్ట్ కిట్‌తో పరీక్షించగా పాజిటివ్‌గా తేలింది. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి తొర్రూర్ కోర్టులో హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు మహబూబాబాద్ డీ-అడిక్షన్ సెంటర్‌కు పంపించారు. గంజాయి విక్రయాలు, వినియోగంపై సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచి నగదు బహుమతి అందజేస్తామని ఎస్సై తెలిపారు.

