పెద్ది సుదర్శన్ రెడ్డికి కాకతీయ ఘన నివాళి
కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎడిటర్ కిరణ్ గౌడ్
పెద్ది స్వప్నకు మనోధైర్యం.. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి
ప్రత్యేక కథనాన్ని చిత్రపటం రూపంలో అందజేసిన పాత్రికేయ బృందం
కాకతీయ, నల్లబెల్లి : తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి జీవితాంతం కృషి చేసిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కాకతీయ దినపత్రిక బృందం గురువారం ఘనంగా నివాళులర్పించింది. కాకతీయ దినపత్రిక ఎడిటర్ అరెల్లి కిరణ్ గౌడ్ ఆధ్వర్యంలో బృందం నల్లబెల్లిలోని ఆయన స్వగృహానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించింది.


అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్నను పరామర్శించిన ఎడిటర్ కిరణ్ , ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పెద్ది సుదర్శన్ రెడ్డి లేని లోటు రాజకీయాలకు మాత్రమే కాకుండా తెలంగాణ సమాజానికే తీరని నష్టమని పేర్కొన్నారు.కుటుంబానికి కాకతీయ దినపత్రిక ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యత ఇస్తూ నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధికి ఆయన విశేషంగా కృషి చేశారని అన్నారు. తనకు పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన ప్రజల పట్ల ఉన్న అంకితభావం, నిరాడంబర జీవనం, అందరినీ కలుపుకుపోయే వ్యక్తిత్వం చిరకాలం గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, ప్రజాసేవ భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మరణించిన రోజు కాకతీయ దినపత్రికలో ప్రచురితమైన ప్రత్యేక కథనాన్ని చిత్రపటం రూపంలో రూపొందించి పెద్ది స్వప్నకు అందజేశారు. కార్యక్రమంలో కాకతీయ దినపత్రిక ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యూరో సందీప్, ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సుమన్, నల్లబెల్లి రిపోర్టర్ కిరణ్ పాల్గొన్నారు.

