epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

న‌మ్మినందుకు న‌ట్టేటే ముంచేశారా..?!

న‌మ్మినందుకు న‌ట్టేటే ముంచేశారా..?!
రూ.30 లక్షల స్థలంపై వివాదం.. చివరకు బాధితుడి ఆత్మహత్యాయత్నం..!
ప్రశ్నిస్తే దాడి.. తిరిగి బాధితుడిపైనే కేసు నమోదైందని ఆరోపణ
న్యాయం చేస్తామన్న పెద్దమనుషులూ మోసమే చేశారంటూ ఆవేదన
స్థల వివాదంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కుటుంబ సభ్యుల డిమాండ్

కాకతీయ, రాజన్న సిరిసిల్ల : పైసా పైసా కూడబెట్టి, తెలిసినవారి వద్ద అప్పులు చేసి రూ.30 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన స్థలం చివరకు ఓ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. స్థలం కొనుగోలు చేసిన నాటి నుంచే సమస్యలు ఎదురవడంతో న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌లు, పెద్దమనుషుల చుట్టూ తిరిగిన బాధితుడికి ఎక్కడా న్యాయం జరగలేదనే మనస్తాపంతో జ్వరం మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సిరిసిల్ల పట్టణానికి చెందిన జి. నవీన్ టెంట్‌హౌస్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండేళ్ల క్రితం పట్టణానికి చెందిన కృష్ణ అనే వ్యక్తి తన భార్య పేరు మీద ఉన్న ఆరున్నర గుంటల స్థలాన్ని రూ.30 లక్షలకు నవీన్‌కు విక్రయించాడు. ఏడాది క్రితం స్థలానికి హద్దులు నిర్ణయించేందుకు వెళ్లగా ఓ వ్యక్తి అడ్డుకుని, సదరు స్థలంలో మూడు గుంటల భూమిని తాను 12 ఏళ్ల క్రితమే కొనుగోలు చేశానంటూ పత్రాలు చూపించాడు. దీంతో నవీన్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వాస్తవానికి అమ్మిన వ్యక్తికి కేవలం మూడు గుంటలే ఉండగా, తప్పుడు పత్రాలు సృష్టించి బాధితుడికి ఆరున్నర గుంటలు విక్రయించినట్లు తెలిసిందని బాధితుడు ఆరోపిస్తున్నాడు.

ప్రశ్నిస్తే కేసు…

తనకు స్థలం విక్రయించిన వ్యక్తిని నవీన్ ఇంటికి వెళ్లి ప్రశ్నించగా, తనకు న్యాయం చేయాలని నిలదీయడంతో కృష్ణతో పాటు మరికొందరు తనపై దాడి చేశారని ఆరోపిస్తున్నాడు. అనంతరం తిరిగి తనపైనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించారని వాపోతున్నాడు.ఈ స్థల వివాదంపై గత కొద్ది రోజులుగా అధికార పార్టీ నాయకులు, పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీలు జరిగాయని బాధితుడు చెబుతున్నాడు. సమస్య పరిష్కరిస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారే తప్ప న్యాయం చేయలేదని ఆరోపిస్తున్నాడు. పెద్దమనుషులు సైతం మోసం చేయడం, అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండడంతో ఎక్కడ చూసినా తనకే అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పలుమార్లు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదనే తీవ్ర మనస్తాపంతో జ్వరం మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. స్థల వివాదంపై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని నవీన్ కుటుంబ సభ్యులు పోలీసు అధికారులను కోరుతున్నారు.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.