సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు సహించేది లేదు
కొండా సుష్మిత బహిరంగ క్షమాపణ చెప్పాలి
విమర్శలకు హద్దులు ఉండాలి : ఎమ్మెల్యే రాందాస్ నాయక్
కాకతీయ, కారేపల్లి : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కొండా సుష్మిత చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తెలిపారు. అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిని వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడటం సరైన రాజకీయ సంస్కృతి కాదన్నారు. కొండా సుష్మిత వెంటనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాలను విమర్శించే హక్కు ఉన్నప్పటికీ వ్యక్తిగత దూషణలకు పాల్పడటం సరికాదన్నారు. సీఎం అమెరికా పర్యటనను అడ్డుకునే ప్రయత్నాలు రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల సాధన కోసం సీఎం పర్యటనలు చేపడుతున్నారని, వాటికి ఆటంకం కలిగించడం తెలంగాణ ప్రయోజనాలకు నష్టమన్నారు. కార్యక్రమంలో తోటకూరి రాంబాబు, అడ్డగూడ ఐలయ్య, టోనీ తదితరులు పాల్గొన్నారు.\

