epaper
Wednesday, September 16, 2026
epaper
BREAKING NEWS
Loading News...

గెస్ట్‌ ఫ్యాకల్టీ నియామకాల్లో గందరగోళం

గెస్ట్‌ ఫ్యాకల్టీ నియామకాల్లో గందరగోళం
ఉత్తర్వులు రాకముందే నియామకం జరిగిందా?
అర్హుల దరఖాస్తులు స్వీకరించని వరంగల్‌ డీఐఈఓ కార్యాలయం
స్థానికుడిని కాదని జనగామ అభ్యర్థికి అవకాశం కల్పిస్తున్నారా?
డీఐఈఓకు దేవేందర్‌ ఫిర్యాదు..
న్యాయం జరగకపోతే కమిషనర్‌ను కలుస్తానని వెల్లడి

కాకతీయ, వరంగల్ బ్యూరో : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీ నియామకాలు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయా? అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించకుండానే పోస్టులు భర్తీ చేస్తున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వరంగల్‌ జిల్లా రాయపర్తి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జంతుశాస్త్ర గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టు భర్తీ వ్యవహారంపై స్థానిక అభ్యర్థి టి. దేవేందర్‌ జిల్లా ఇంటర్‌ విద్యాధికారి (డీఐఈఓ)కు ఫిర్యాదు చేశారు. ఉత్తర్వులు వెలువడకముందే ఓ వ్యక్తిని విధుల్లోకి తీసుకున్నారని, తన దరఖాస్తును స్వీకరించలేదని ఆయన పేర్కొన్నారు. 2026–2027 విద్యా సంవత్సరానికి గెస్ట్‌ ఫ్యాకల్టీ నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ డైరెక్టర్‌ ఈ నెల 7న Rc. No. CIE-SIIB/GAPB/1/2024-SER-II ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే రాయపర్తి కళాశాలలో జంతుశాస్త్ర విభాగానికి ఓ వ్యక్తిని అంతకుముందే చేర్చుకుని గత 15 రోజులుగా విధుల్లో కొనసాగిస్తున్నట్లు సమాచారం. అధికారిక నోటిఫికేషన్‌, దరఖాస్తుల స్వీకరణ, ఎంపిక ప్రక్రియ పూర్తికాకముందే నియామకం ఎలా జరిగింది? ఆ వ్యక్తిని విధుల్లోకి తీసుకునేందుకు ఎవరు అనుమతించారు? అన్నది తేలాల్సి ఉంది.

దరఖాస్తు తీసుకోలేదంటున్న దేవేందర్‌

రాయపర్తి కళాశాలలోని ఖాళీ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 8, 9 తేదీల్లో వరంగల్‌ డీఐఈఓ కార్యాలయానికి వెళ్లినట్లు దేవేందర్‌ తెలిపారు. అయితే తన దరఖాస్తును సిబ్బంది స్వీకరించలేదని, ‘‘ఇప్పటికే అక్కడ ఒకరు 15 రోజులుగా పనిచేస్తున్నారు.. వారినే కొనసాగిస్తాం.. మీరు రావాల్సిన అవసరం లేదు’’ అని చెప్పి వెనక్కి పంపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకోకుండా ముందుగానే ఒకరిని కొనసాగించడం ఏ నిబంధనల కిందకు వస్తుందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

స్థానికతకు ప్రాధాన్యం లేదా?

గెస్ట్‌ ఫ్యాకల్టీ ఎంపికలో స్థానికతతో పాటు విద్యార్హతల్లో ఉత్తీర్ణత శాతం, గతంలో పనిచేసిన బోధనానుభవం, విద్యార్థుల ఫలితాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. తనకు అర్హతలు, గత అనుభవం ఉన్నప్పటికీ వరంగల్‌ స్థానికుడైన తనను పక్కనపెట్టి మల్టీజోన్‌–2 పరిధిలోని జనగామ జిల్లాకు చెందిన అభ్యర్థికి అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని దేవేందర్‌ పేర్కొన్నారు. స్థానికత, మెరిట్‌, అనుభవం పరిశీలించకుండానే ఎంపిక నిర్ణయం తీసుకున్నారా? పైరవీలకు ప్రాధాన్యం ఇచ్చారా? అన్నది అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది.

న్యాయం జరగకపోతే కమిషనర్‌కు ఫిర్యాదు

తన దరఖాస్తును స్వీకరించి అర్హతలను పరిశీలించాలని దేవేందర్‌ డీఐఈఓను కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే మల్టీజోన్‌–1 ఆర్జేడీ, హైదరాబాద్‌లోని ఇంటర్మీడియట్‌ విద్యా కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఉత్తర్వులు రాకముందే విధుల్లోకి తీసుకున్న వ్యక్తి అర్హతలు, నియామకానికి సంబంధించిన రికార్డులు, దరఖాస్తుల స్వీకరణ వివరాలపై విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని ఆయన కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

 ఏటూరునాగారంలో గుర్తు తెలియని మృతదేహం

 ఏటూరునాగారంలో గుర్తు తెలియని మృతదేహం కాకతీయ,ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూరునాగారం మండల...

బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతా.. పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆశయ సాధనకు కృషి

బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతా.. పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆశయ సాధనకు కృషి నల్లబెల్లి మండల క్లస్టర్‌...

సారయ్య కు కొండా సురేఖ కౌంటర్

మైక్‌ కనిపించగానే ఊగిపోతున్నారు ముందు మా అనుచరులపై కార్పొరేటర్‌గా గెలవాలి బసవరాజు సారయ్యకు కొండా...

సీసీగా ఇషాక్‌.. పీఆర్వోగా తిరుపతి

సీసీగా ఇషాక్‌.. పీఆర్వోగా తిరుపతి వేణుగోపాల్‌రావు, మోహనకృష్ణ బదిలీ కాకతీయ, హన్మకొండ: వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌లో...

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌

జై శ్రీరామ్‌ బస్తాల్లో పీడీఎస్‌ బియ్యం రీప్యాకింగ్‌ హసన్‌పర్తిలో ముఠా గుట్టురట్టు.. 56...

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు

బాధ్యతాయుతమైన జర్నలిజంతోనే సమాజానికి మేలు వార్త ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి ప్ర‌జాప్ర‌యోజ‌నాన్ని దృష్టిలో...

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో 22 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ..

కమిషనరేట్‌లో భారీగా సీఐల బదిలీలు 22 మంది ఇన్‌స్పెక్టర్లకు స్థానచలనం కీలక పోలీస్‌స్టేషన్లకు కొత్త...

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం

ములుగు ఇసుక క్వారీల్లో వివాదం త‌న‌పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిందంటూ బీఆర్ఎస్ చ‌క్ర‌పాణి ఆరోప‌ణ‌ మూడు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.