epaper
Wednesday, November 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వాలీబాల్ లో సత్తా చాటిన మంద నందిని

వాలీబాల్ లో సత్తా చాటిన మంద నందిని
ల్యాబార్తి ముద్దు బిడ్డకు జాతీయ స్థాయి పిలుపు

కాకతీయ, వరంగల్ ప్రతినిధి : చిన్న గ్రామం నుంచి జాతీయ స్థాయి క్రీడా వేదికకు ల్యాబార్తి గ్రామానికి చెందిన మంద నందిని ఎంపికైంది. వర్ధన్నపేట మండలం ల్యాబార్తి గ్రామ పాఠశాల పూర్వ విద్యార్థిని, వెంకట్రావు కుమార్తె అయిన నందిని జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీల్లో పాల్గొనే తెలంగాణ బాలికల జట్టుకు ఎంపికై గ్రామానికి గుర్తింపు తీసుకొచ్చింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల చింతకుంట గురుకుల కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ఆమె నవంబర్‌ 5, 6, 7 తేదీల్లో గోదావరిఖనిలో జరిగిన రాష్ట్రస్థాయి పాఠశాలల వాలీబాల్‌ పోటీల్లో 17 ఏళ్ల విభాగంలో ప్రతిభ కనబరిచింది. దీంతో జాతీయ జట్టులో చోటు దక్కించుకుంది. ఇప్పటికే మూడుసార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న అనుభవం ఆమెకు ఉంది.

రాజస్థాన్‌లో జాతీయ పోటీలు

డిసెంబర్‌ 10 నుంచి 16 వరకు రాజస్థాన్‌లోని సికర్‌లో జాతీయస్థాయి వాలీబాల్‌ పోటీలు జరగనున్నాయి. నందిని ఎంపిక విషయాన్ని ల్యాబార్తి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లింగం శైలజ, వ్యాయామ ఉపాధ్యాయుడు జలగం రఘువీర్‌ వెల్లడించారు. నందినితోపాటు ఆమెను క్రీడల్లో ప్రోత్సహించిన రఘువీర్‌ను తెలంగాణ రాష్ట్ర వాలీబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గజ్జెల్ల రమేష్‌బాబు, గ్రామ సర్పంచ్‌ మన్నూరు శారద సోము, ఉప సర్పంచ్‌ సంకినేని గంగరాజు, చింతకుంట గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌ ఏ.లక్ష్మి, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్‌ పబ్బోజు సునీత, పీడీ సుష్మా, హౌస్‌ టీచర్‌ మాధురి, పీఈటీ సుజాత, కోచ్‌ బి.సతీష్‌, ఎం.వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వామ్మో..!మండి బ‌జార్‌లో బిర్యానీ

వామ్మో..!మండి బ‌జార్‌లో బిర్యానీ మూడు హోటళ్లలో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు సింథటిక్‌ రంగులు, టేస్టింగ్‌ సాల్ట్‌,...

సంక్షేమ పథకాలే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యం

సంక్షేమ పథకాలే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యం అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యం...

కార్యకర్తల కష్టసుఖాల్లో అండగా ఉంటా..

కార్యకర్తల కష్టసుఖాల్లో అండగా ఉంటా.. - బీజేపీ రాష్ట్ర నాయకులు డా. పగడాల...

ఉద్యమానికి పాటలతో ఊపిరిపోసిన మహనీయుడు అందెశ్రీ

ఉద్యమానికి పాటలతో ఊపిరిపోసిన మహనీయుడు అందెశ్రీ కాకతీయ, ఇనుగుర్తి : ‘జయ జయహే...

రాష్ట్రస్థాయి క్రీడ పోటీలకు ఆలేరు విద్యార్థులు

రాష్ట్రస్థాయి క్రీడ పోటీలకు ఆలేరు విద్యార్థులు కాకతీయ, నెల్లికుదురు : మండలంలోని ఆలేరు...

గిరిజన విద్యార్థినుల్లో ప్రతిభా వికాసం

గిరిజన విద్యార్థినుల్లో ప్రతిభా వికాసం ఐదు క్లబ్‌ల ఆధ్వర్యంలో వినూత్న పోటీలు వివిధ అంశాల్లో...

టీజీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

టీజీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి రెండు రోజుల్లో 3,650 మంది అభ్యర్థులు...

రాష్ట్రస్థాయి పోలీస్‌ క్రికెట్‌ పోటీల్లో సత్తా చాటాలి

రాష్ట్రస్థాయి పోలీస్‌ క్రికెట్‌ పోటీల్లో సత్తా చాటాలి వరంగల్‌ జట్టుకు సీపీ ఎన్‌....

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.