epaper
Wednesday, November 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వెయ్యి గ్రామాలు దాటిన భూ రీసర్వే!

వెయ్యి గ్రామాలు దాటిన భూ రీసర్వే!
2,720 గ్రామాల్లో సమగ్ర సర్వేకు శ్రీకారం
ఇప్పటికే 416 గ్రామాల్లో ప్రక్రియ పూర్తి
భూ యజమానుల అభ్యంతరాలకు తప్పనిసరిగా అవకాశం
చిన్న పొరపాటుకూ తావులేకుండా సర్వే నిర్వహణ
భూదార్‌ కేటాయింపును వేగవంతం చేయాలి
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశం

కాకతీయ, తెలంగాణ బ్యూరో : తరతరాలుగా పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ రీసర్వే వెయ్యి గ్రామాల మైలురాయిని దాటింది. ఇప్పటివరకు 416 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తయింది. భూ యజమానులకు స్పష్టమైన హక్కులు, కచ్చితమైన సరిహద్దులు కల్పించడమే ఈ కార్యక్రమంలో అత్యంత ప్రాధాన్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సర్వేలో చిన్న పొరపాటు కూడా భవిష్యత్తులో మరో భూ వివాదానికి కారణం కాకూడదని, ప్రతి దశలో పారదర్శకత, శాస్త్రీయత, కచ్చితత్వం పాటించాలని అధికారులను ఆదేశించారు. భూ యజమానుల అభిప్రాయాలు, అభ్యంతరాలకు పూర్తి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలు ఉండగా, తొలి దశలో హైదరాబాద్‌ మినహా మిగిలిన 32 జిల్లాల్లో జిల్లాకు 70 గ్రామాల చొప్పున ఎంపిక చేశారు. నక్షాలు అందుబాటులో లేని గ్రామాలను కూడా కలుపుకొని మొత్తం 2,720 గ్రామాల్లో రీసర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు వెయ్యి గ్రామాల్లో సర్వే మైలురాయిని దాటగా, 416 గ్రామాల్లో ప్రక్రియ పూర్తయినట్లు మంత్రి వెల్లడించారు. సుమారు 125 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఈ చారిత్రక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

రెవెన్యూ రికార్డుల పరిశీలన తర్వాతే క్షేత్రస్థాయి సర్వే

గ్రామంలో సర్వే ప్రారంభించే ముందు అక్కడి రెవెన్యూ రికార్డులను పూర్తిస్థాయిలో పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. రికార్డుల్లో నమోదైన భూముల విస్తీర్ణం, యాజమాన్య హక్కులు, సరిహద్దుల వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే వాటి ఆధారంగా క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టాలని స్పష్టం చేశారు. సర్వే పూర్తయిన అనంతరం సంబంధిత భూ యజమానులకు తప్పనిసరిగా నోటీసులు జారీ చేయాలని, నమోదైన వివరాలను పరిశీలించుకునేందుకు తగిన సమయం ఇవ్వాలని సూచించారు. ఏవైనా అభ్యంతరాలు, అభిప్రాయాలు ఉంటే నమోదు చేసుకునే అవకాశం కల్పించి, వాటిని నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. సర్వే విధానం, నోటీసుల జారీ, అభ్యంతరాల నమోదు, పరిష్కార ప్రక్రియపై గ్రామస్థాయిలో రైతులు, భూ యజమానులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. సర్వే ప్రక్రియపై ఎలాంటి అపోహలు, అనుమానాలు లేకుండా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. కేవలం ప్రభుత్వ రికార్డుల నవీకరణకే సర్వే పరిమితం కాకూడదని, ప్రతి భూ యజమానికి తన భూమిపై స్పష్టమైన హక్కులు, కచ్చితమైన హద్దులు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో గుర్తించే చిన్నచిన్న లోపాలను వెంటనే సరిదిద్దాలని, ఒక్క తప్పిదం కూడా భవిష్యత్తులో వివాదానికి దారితీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

భూదార్‌ కేటాయింపునకు చర్యలు

రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రతి భూమికి ఆధార్‌ తరహాలో ప్రత్యేక గుర్తింపు కల్పించే భూదార్‌ నంబర్‌ కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. భూముల విస్తీర్ణం, హక్కులు, సరిహద్దులకు సంబంధించిన స్పష్టమైన రికార్డులు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. తరతరాలుగా ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అవుతున్న భూ సమస్యలకు ఈ సమగ్ర సర్వే ద్వారా శాశ్వత ముగింపు పలకాలని స్పష్టం చేశారు. భవిష్యత్తు తరాలకు భూ వివాదాలు లేని తెలంగాణను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రీసర్వే పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, సర్వే నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, సర్వే శాఖ సహాయ సంచాలకులతో ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని మంత్రి నిర్ణయించారు. జిల్లా వారీగా పురోగతిని సమీక్షించి, తదుపరి కార్యాచరణపై ఆదేశాలు ఇవ్వనున్నారు. మంగళవారం సచివాలయంలో రెవెన్యూ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి క్షేత్రస్థాయిలో సర్వే సిబ్బందితో ఫోన్‌లో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్‌. లోకేష్‌కుమార్‌, భూ సర్వే, భూ రికార్డుల కమిషనర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు, సంయుక్త సంచాలకురాలు ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అండాల అక్రమ దందా.. అసలు సూత్రధారులెక్కడ?

అండాల అక్రమ దందా.. అసలు సూత్రధారులెక్కడ? 43 మంది మహిళలకు విముక్తి.. తొమ్మిది...

మేడిగడ్డ పాపం కేసీఆర్‌దే

మేడిగడ్డ పాపం కేసీఆర్‌దే కుంగుబాటుకు గత ప్రభుత్వ నిర్ణయాలే కారణం ప్రాణహితను పక్కనపెట్టి కాళేశ్వరానికి...

బేతుపల్లి చెరువు కథ సుఖాంతం అందరూ సేఫ్….

బేతుపల్లి చెరువు కథ సుఖాంతం అందరూ సేఫ్.... బేతుపల్లి చెరువును సందర్శించిన మంత్రి తుమ్మల రాష్ట్ర...

వైఎస్సార్‌ నగర్‌ భూములపై విచారణ

వైఎస్సార్‌ నగర్‌ భూములపై విచారణ ఆ భూముల‌తో నాకేలాంటి సంబంధం లేదు విచార‌ణ చేప‌ట్టాల‌ని...

చిట్టీ సొమ్ముకు చిల్లర భూములు

చిట్టీ సొమ్ముకు చిల్లర భూములు రూ.2 లక్షల ప్లాటు.. రూ.20 లక్షల లెక్క! నగదుకు...

సమస్యలు తీరేదెప్పుడు?..

సమస్యలు తీరేదెప్పుడు?.. ఉద్యోగుల గళం వినేదెవరు? పెండింగ్‌ సమస్యల పరిష్కారంపై ఉద్యోగుల్లో ఎదురుచూపులు రెండో వేతన...

మరో వెలుగుమట్లగా వైఎస్సార్‌ నగర్‌!

మరో వెలుగుమట్లగా వైఎస్సార్‌ నగర్‌! మూడు దశాబ్దాలుగా గుడిసెల్లో బతుకులు ఇప్పుడు ఖాళీ చేయాలంటూ ...

జోరందుకోనున్న తెలంగాణ జనసేన!

జోరందుకోనున్న తెలంగాణ జనసేన! సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా ‘అలయ్‌ బలాయ్‌’ పట్టభద్రుల ఎమ్మెల్సీ నుంచి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.