చిన్న నాగారంలో 29 న మెగా వైద్య శిబిరం..
వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కాకతీయ, ఇనుగుర్తి: ఇనుగుర్తి మండలం లోని చిన్ననాగరంలో ఈనెల 29న,(మంగళవారం)జంగాల రాజేశ్వర్రావు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ ద్వారా,సాయిరామ్ హాస్పిటల్స్ వారి సహకారం తో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు స్థానిక సర్పంచి చెడుపాక సుజాత యాకయ్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం విలేకరులతో సర్పంచి మాట్లాడుతూ..ఉచిత వైద్య శిబిరంలో ఖమ్మం కు చెందిన గ్యాస్ట్రో,లివర్, ఉదరకోశ వ్యాధులకు సంబంధించిన సమస్యలతో పాటు కిడ్నీ, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, సర్జికల్ గ్యాస్ట్రో, గ్యాస్ట్రో మెడిసిన్, ఆంకాలజీ, కార్డియాలజీ, అంకాలజీ, డయాబెటిక్, సైనస్, ఆప్తమాలజీ, జనరల్ సర్జన్, డెర్మటాలజీ, తదితర విభాగాలకు చెందిన గుర్తింపు పొందిన వైద్యులు పాల్గొని రోగులకు ఉచితంగా పరిక్షలు నిర్వహించి ఫ్రీగా మందులు అందజేయనున్నట్లు తెలిపారు. వైద్య శిబిరం ఉ.10-00గంటల నుంచి మధ్యాహ్నం గం.1-00 వరకు నిర్వహించబడుతుందని చెప్పారు. గ్రామ సర్పంచ్ అభ్యర్థన మేరకు జంగాల రాజేశ్వర్రావు సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ ద్వారా,సాయిరామ్ హాస్పిటల్స్ వారి సహకారం తో చిన్ననాగారంలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సేవ్ యువర్ లివర్ ఫౌండేషన్ డైరెక్టర్ గెడ్డం సామ్యూల్ ప్రజలకు పిలుపునిచ్చారు.అధిక సంఖ్యలో గ్రామస్తుల తో పాటు గ్రామ పరిధిలోని తండాలకు చెందినవారు వచ్చి తమ ఆరోగ్య సమస్యలను వైద్యులతో పరీక్షలు చేయించుకుని ఉచిత మందులు పొందాల్సిందిగా కోరారు.

