ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ఐక్యంగా ముందుకు సాగుదాం
కార్మికుల హక్కుల పరిరక్షణే లక్ష్యంగా పనిచేద్దాం
టీబ్ల్యూడబ్ల్యూయూ–ఎస్‌డబ్ల్యూఎఫ్ కూటమికి మద్దతివ్వాలి
వర్కర్స్ తెలంగాణ యూనియన్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి పిలుపు
కాకతీయ, వరంగల్: ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా ముందుకు సాగాలని వర్కర్స్ తెలంగాణ యూనియన్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం వరంగల్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు, సంక్షేమం, హక్కుల పరిరక్షణపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్ పిలుపు మేరకు టబ్ల్యూడబ్ల్యూయూ–ఎస్‌డబ్ల్యూఎఫ్ కూటమి బాణం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లా రీజియన్ అధ్యక్షుడు హోదాలో జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బొంతు రామ్మోహన్, అశ్వత్థామరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పాల్గొని ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడారు. కార్మికుల ఐక్యతే బలమని, హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టబ్ల్యూడబ్ల్యూయూ జిల్లా కార్యదర్శి జితేందర్‌రెడ్డి, ఎస్‌డబ్ల్యూఎఫ్ కార్యదర్శి ఉపేందర్‌చారి, పి. ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

