108 అంబులెన్స్ పైలెట్‌కు ఘనంగా వీడ్కోలు
నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వహించారు
పదవీ విరమణ సందర్భంగా ఘన సన్మానం
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ భూమా నాగేందర్ ప్రశంస
కాకతీయ, శంకరపట్నం: మండలంలోని 108 అంబులెన్స్‌లో పైలెట్‌గా విధులు నిర్వహించిన కాజా ఖలీల్ ఉల్లా పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా 108 కార్యాలయ ఆవరణలో తోటి ఉద్యోగులు, మిత్రుల ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ భూమా నాగేందర్, కరీంనగర్ జిల్లా మేనేజర్ సయ్యద్ ఇమ్రాన్ హాజరయ్యారు. ఖలీల్ తన సర్వీసు కాలంలో నిబద్ధత, క్రమశిక్షణతో విధులు నిర్వహించారని భూమా నాగేందర్ కొనియాడారు. సంస్థ అభివృద్ధికి ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. సయ్యద్ ఇమ్రాన్ మాట్లాడుతూ ఖలీల్ సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని తెలిపారు. తన ఉద్యోగ ప్రయాణంలో సహకరించిన ఉన్నతాధికారులు, తోటి సిబ్బంది, మిత్రులకు ఖలీల్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయనను శాలువాలు, పూలమాలలతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. సతీష్‌రెడ్డి సైతం శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందించారు. ఖలీల్ శేష జీవితం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో సాగాలని తోటి ఉద్యోగులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో కేశవపట్నం 108 సిబ్బంది ఈఎంటీ గూడూరి సతీష్‌రెడ్డి, పైలెట్లు గోపికృష్ణ, సదన్రెడ్డి, మహేందర్‌రెడ్డి, రాజేందర్, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

