epaper
Friday, October 2, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కాకతీయ ఎఫెక్ట్

కాకతీయ ఎఫెక్ట్
లక్ష్మీపురం మార్కెట్ లో కదిలిన యంత్రాంగం
రోడ్డు ఆక్రమించిన 14 మంది అక్రమార్కులకు నోటీసులు
తడకల షెడ్లు తొలగించకుంటే సీజ్ కు హెచ్చరిక

కాకతీయ, వరంగల్ ప్రతినిధి: కాకతీయ దినపత్రిక కథనాలతో లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ లో అధికార యంత్రాంగం కదిలింది. రహదారిని ఆక్రమించి అక్రమంగా తడకల షెడ్లు వేసుకున్న 14 మంది వ్యాపారులను అధికారులు గుర్తించి గురువారం నోటీసులు జారీ చేశారు. ఎన్నో ఏళ్లుగా మోడల్ కూరగాయల మార్కెట్ ముందు రోడ్డుపై ఇరువైపులా అక్రమంగా తడకల షెడ్లు వేసి, రోడ్లనే గోదాములుగా, రోడ్లనే దుకాణాలుగా మార్చి ఒకవైపు మార్కెట్ ఆదాయానికి గండి కొడుతున్నారు. మరోవైపు ట్రాఫిక్ జామ్ తో కూరగాయలు కొనడానికి వచ్చే మహిళలు, వృద్ధులు, వాహనదారులు నిత్యం ఇక్కట్లు పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన కాకతీయ దినపత్రిక “మోడల్ మార్కెట్ లో అక్రమాల జాతర” అంటూ కథనాన్ని ప్రచురించింది. దీంతో మార్కెట్ పాలకవర్గం సీరియస్ గా తీసుకుని తడకలు తీసివేయాలని అధికారులకు హుకుం జారీ చేసింది. అధికారులు అక్రమార్కులకు రోడ్లపై వేసుకున్న తడకల షెడ్లను తొలగించాలని తెలిపారు. ఈ విషయంపై అక్రమార్కులు పాలకవర్గాన్ని, మార్కెట్ కార్యదర్శిని కలిసి వినాయక చవితి పండగ తర్వాత తొలగిస్తామని చెప్పి, తొలగించకుండా యథావిధిగా కొనసాగిస్తుండగా, “మోడల్ మార్కెట్ లో మాట తప్పిన అక్రమార్కులు” శీర్షికన కాకతీయ దినపత్రికలో మరో కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి శ్రీనివాస్ మంగళవారం సర్కులర్ జారీ చేశారు.

వ్యాపారికి నోటీసులు ఇస్తున్న మార్కెట్ ఉద్యోగులు

సర్కులర్ లోని హెచ్చరిక ఇదే..

లక్ష్మీపురం మార్కెట్లో హోల్ సేల్ వ్యాపారం కోసం 99 షాపులు, రిటైల్ వ్యాపారుల పోషణ కోసం 8×8, 6×6, 4×4 అడుగుల ప్లాట్లు కేటాయించినప్పటికీ, కొందరు కమిషన్ ఏజెంట్లు (అడ్తీ) మరియు రిటైల్ వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా మార్కెట్ వెలుపల రహదారికి ఇరువైపులా ఎటువంటి అనుమతి లేకుండా తడకల షెడ్లు వేసుకుని వ్యాపారం చేస్తున్నారు. వాటి ముందు టమాటా వాహనాల పార్కింగ్ తో వినియోగదారులు, ఇతర వ్యాపారులు, ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇది మార్కెట్ చట్టం, లైసెన్సు నిబంధనల ఉల్లంఘన. కావున అనధికారిక తడకల షెడ్లను వెంటనే తొలగించాలి. లేనిపక్షంలో సంబంధిత షాపు/ప్లాట్ ను మార్కెట్ కమిటీ స్వాధీనం చేసుకుని, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇంతవరకు నోటీసుల వరకు బాగానే ఉంది. కానీ కేవలం నోటీసులకే పరిమితం కాకుండా, రోడ్డుకు ఇరువైపులా ఉన్న తడకల షెడ్లను తొలగించి చూపిస్తేనే వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందులు తొలగుతాయని ప్రజలు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్యా ప్రమాణాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి

విద్యా ప్రమాణాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి ఎఫ్‌ఏ–2 ఫలితాలను విశ్లేషించి కార్యాచరణ రూపొందించాలి విద్యతోపాటు...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటాలి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సత్తా చాటాలి ప్రతి ఓటరును నేరుగా కలిసి పార్టీ...

వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన ర్యాలీ

వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన ర్యాలీ కాకతీయ, ఏటూరునాగారం : జాతీయ వన్యప్రాణి వారోత్సవాల్లో...

రాయపర్తిలో 10,097 ఎస్ఐఆర్ నోటీసులు

రాయపర్తిలో 10,097 ఎస్ఐఆర్ నోటీసులు 97 శాతం పూర్తయిన సవరణ ప్రక్రియ ఇంకా...

కేసీఆర్‌ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష

కేసీఆర్‌ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష ప్ర‌జ‌ల‌కిచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్ర‌భుత్వం విఫ‌లం రైతులు...

పీఎం శ్రీ పాఠశాలల జిల్లాస్థాయి మాక్‌ పార్లమెంట్‌

పీఎం శ్రీ పాఠశాలల జిల్లాస్థాయి మాక్‌ పార్లమెంట్‌ రాష్ట్రస్థాయి మాక్‌ పార్లమెంటుకు సిరివెన్నెల...

ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం : ప్రొఫెసర్ ఎర్రగట్టు స్వామి

ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం : ప్రొఫెసర్ ఎర్రగట్టు స్వామి ఘనంగా జూనియర్ కళాశాలల...

మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ

మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ కాకతీయ, ఇనుగుర్తి : ఇనుగుర్తి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.