epaper
Friday, October 2, 2026
epaper
BREAKING NEWS
Loading News...

చేర్యాల మహిళలకు ఎంపీ చామల అండ

చేర్యాల మహిళలకు ఎంపీ చామల అండ
చేర్యాల‌ ప్రాంత అభివృద్దే కాంగ్రెస్ లక్ష్యం
కుట్టుమిషన్లు, కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీలో ఎంపీ చామల
చేర్యాల అభివృద్ధికి ఎంపీ నిధులు కేటాయించాలి : ఎమ్మెల్యే పల్లా

కాకతీయ,చేర్యాల : మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. చేర్యాల పట్టణంలోని రేణుక గార్డెన్‌లో గురువారం చేర్యాల పట్టణంతో పాటు చేర్యాల, కొమురవెల్లి, మద్దూర్‌, దూల్మిట్ట మండలాలకు చెందిన మైనారిటీ మహిళా లబ్ధిదారులకు 56 కుట్టు మిషన్లు,252 కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.అలానే చేర్యాల పట్టణంలోని షాదిఖానా ఫంక్షన్ హాల్ డైనింగ్ హాల్ నిర్మాణం కోసం ఎంపీ నిధులనుంచి రూ,10 లక్షల నిధులు మంజూరు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి లబ్ధిదారులకు స్వయంగా చెక్కులు, మహిళలకు కుట్టు మిషన్లు అందజేసీ షాదిఖానా డైనింగ్ హాల్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..మహిళలు ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కుట్టు మిషన్లను సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలను పెంచుకోవాలని మహిళలకు సూచించారు. చేర్యాల ప్రాంత అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి తన వంతు కృషి కొనసాగుతుందని, ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ రుణపడి ఉంటుందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరింత విస్తృతంగా అందేలా కృషి చేస్తానని తెలిపారు.

చేర్యాల అభివృద్ధికి ఎంపీ నిధులు కేటాయించాలి: ఎమ్మెల్యే పల్లా

చేర్యాల ప్రాంత అభివృద్ధికి భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఎంపీ నిధులు కేటాయించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు. 53 గ్రామాల అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ఒక్కో గ్రామానికి రూ.5 లక్షల చొప్పున నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఎలాంటి జాప్యం లేకుండా అందించాలని అధికారులను సూచించారు. కల్యాణలక్ష్మి చెక్కుల విషయంలో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.చేర్యాల, తపాస్‌పల్లి, బచ్చన్నపేట, నాగపురి ప్రాంతాల్లోని చెరువులు పూర్తిగా నిండే వరకు నీటిని విడుదల చేయాలని, ఈ విషయంపై అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఎంపీని కోరారు. మహిళలకు ప్రభుత్వ పథకాల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు, లబ్ధిదారులతో పాటు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

చేర్యాల మహిళలకు ఎంపీ చామల అండ

చేర్యాల మహిళలకు ఎంపీ చామల అండ చేర్యాల‌ ప్రాంత అభివృద్దే కాంగ్రెస్ లక్ష్యం...

చేర్యాల మున్సిపల్ కమిషనర్‌గా అభిలాష్

చేర్యాల మున్సిపల్ కమిషనర్‌గా అభిలాష్ కాకతీయ,చేర్యాల : చేర్యాల మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా...

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.