రామగుండం పీఆర్టీయూటీఎస్ నూతన కార్యవర్గం
మండల అధ్యక్షుడిగా తాండ్ర ప్రేమ్‌కుమార్
ప్రధాన కార్యదర్శిగా పెరటి రవీందర్.. పలు పదవులకు ఎన్నిక
రామగుండం మండల టీచర్ యూనియన్ నూతన కార్యవర్గం
కాకతీయ, రామగుండం : రామగుండం మండల టీచర్ యూనియన్ పీఆర్టీయూటీఎస్ నూతన కార్యవర్గం గురువారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. జిల్లా అధ్యక్షుడు గండు కృష్ణమూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి కానుగంటి శ్రీనివాస్, సీనియర్ నాయకుల పర్యవేక్షణలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. మండల అధ్యక్షుడిగా తాండ్ర ప్రేమ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా పెరటి రవీందర్, అసోసియేట్ అధ్యక్షుడిగా బి. సత్యనారాయణ, మహిళా అసోసియేట్ అధ్యక్షురాలిగా వి. సంగీత ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా జి. ఫ్రాన్సిస్, బి. లక్ష్మణ, మహిళా ఉపాధ్యక్షులుగా బి. స్వప్న, బి. లలిత బాధ్యతలు చేపట్టనున్నారు. కార్యదర్శులుగా డి. రాజిరెడ్డి, బి. సుభాష్, మహిళా కార్యదర్శులుగా ఎన్. రాణి, ఐ. రాజేశ్వరి ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులకు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణతోపాటు సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు నూతన కార్యవర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు.

