epaper
Sunday, October 4, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అక్రమ స్కానింగ్ కేంద్రాలపై దాడులు

అక్రమ స్కానింగ్ కేంద్రాలపై దాడులు
రెండు పోర్టబుల్ మిషన్లు సీజ్
అనుమతి లేకుండా లింగ నిర్ధారణ పరీక్షలు – 8 మందిపై కేసులు, పలువురు అదుపులోకి

కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ జిల్లాలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న అక్రమ స్కానింగ్ కేంద్రాలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కొరడా ఝళిపించారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి రాజా రెడ్డి ఆదేశాల మేరకు నెక్కొండ, కాశీబుగ్గ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి రెండు పోర్టబుల్ స్కానింగ్ మిషన్లను సీజ్ చేశారు.

నెక్కొండలో ఉపేందర్ ఆసుపత్రిలో దాడి
నెక్కొండలోని ఉపేందర్ ఆసుపత్రిలో అక్రమ స్కానింగ్ కేంద్రం నడుస్తున్నదన్న సమాచారంతో ప్రోగ్రాం అధికారి డాక్టర్ సాజిదా బృందం పోలీస్, రెవెన్యూ అధికారులతో కలిసి తనిఖీ చేశారు.
రిజిస్ట్రేషన్ లేకుండా, అర్హతలు లేని డాక్టర్ పార్థు (బిఏఎంఎస్, ఎండి – ఆయుష్ ) స్కానింగ్ చేస్తూ, లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు గుర్తించారు. మిషన్ ను సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. మిషన్ ను అద్దెకు ఇస్తున్న గణేష్, కేసులను తీసుకువస్తున్న పద్మ ను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

కాశీబుగ్గలో ఇంట్లోనే అక్రమ స్కానింగ్
కాశీబుగ్గలోని వివేకానంద కాలనీలో ఇంట్లోనే అక్రమంగా స్కానింగ్ చేస్తున్నట్లు సమాచారం రావడంతో ప్రోగ్రాం అధికారి సయ్యద్ ఇక్తిదార్ అహ్మద్ బృందం ఇంతేజార్ గంజ్ పోలీసులతో కలిసి దాడి చేసింది.

చిర్ర మాధవి అనే స్టాఫ్ నర్స్ తన బంధువు నిరోష తో కలిసి ఎలాంటి అర్హతలు లేకుండా ఇంట్లోనే గర్భిణులకు స్కానింగ్ చేస్తున్నట్లు తేలింది. ఒక పోర్టబుల్ మిషన్ సీజ్ చేశారు. లింగ నిర్ధారణ కోసం గర్భిణులను తీసుకువస్తున్న నిరోష, గణేష్ పై కేసు నమోదు చేశారు. ఈ మిషన్ ను దిలీప్ అనే వ్యక్తి విక్రయించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

ఆడ శిశువు అని తేలితే అబార్షన్ కు రెఫర్
ఈ దాడుల్లో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. లింగ నిర్ధారణలో ఆడ శిశువు అని తేలిన గర్భిణులను గర్భస్రావం కోసం మహబూబాబాద్ లోని ఆర్ఎంపి మహేందర్ వద్దకు, నెక్కొండలోని డాక్టర్ అంజన్ కుమార్ వద్దకు పంపుతున్నట్లు అధికారులు గుర్తించారు.

నిందితులందరిపై పిసిపి ఎన్ డిటి చట్టం 1994 (గర్భస్థ పూర్వ మరియు గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ నిషేధిత చట్టం) ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
జిల్లాలో అక్రమ స్కానింగ్ కేంద్రాల నిర్వహణ, లింగ నిర్ధారణ పరీక్షలు చట్టవిరుద్ధమని, ఇటువంటి కార్యకలాపాలపై వైద్య ఆరోగ్య, పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయంతో నిరంతరం తనిఖీలు చేస్తామని డిఎంహెచ్ఓ డాక్టర్ రాజా రెడ్డి హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ములుగు అదనపు ఎస్పీ కారును ఢీకొట్టిన టిప్పర్‌

ములుగు అదనపు ఎస్పీ కారును ఢీకొట్టిన టిప్పర్‌ కాకతీయ, ములుగు : ములుగు...

వర్ధన్నపేటలో 3 ఆలయాలకు ట్రస్ట్‌ బోర్డులు

వర్ధన్నపేటలో 3 ఆలయాలకు ట్రస్ట్‌ బోర్డులు ఒక్కో ఆలయానికి 5 మంది సభ్యులతో...

మాజీ సర్పంచ్‌ నుంచి వేధింపులు

మాజీ సర్పంచ్‌ నుంచి వేధింపులు 5 ఏళ్లుగా గ్రామం నుంచి వెళ్లిపోవాలంటూ ఇబ్బందులు సూరారం...

అధికారులు అలసత్వం వీడండి…. అభివృద్ధి పనులపై దృష్టి సారించండి

అధికారులు అలసత్వం వీడండి.... అభివృద్ధి పనులపై దృష్టి సారించండి ---- ఎమ్మెల్యే భూక్య...

పట్టభద్రులు ఓటరుగా నమోదు కావాలి

పట్టభద్రులు ఓటరుగా నమోదు కావాలి కాకతీయ, వరంగల్ బ్యూరో :రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ...

ప్రజా ప్రభుత్వంతోనే ప్రజలు సుభిక్షంగా ఉన్నారు

ప్రజా ప్రభుత్వంతోనే ప్రజలు సుభిక్షంగా ఉన్నారు లబ్ధిదారులకు రూ.76 లక్షల కళ్యాణ లక్ష్మి,షాదీ...

ఏటూరునాగారంలో తక్షణమే కోర్టు ఏర్పాటు చేయాలి

ఏటూరునాగారంలో తక్షణమే కోర్టు ఏర్పాటు చేయాలి ప్రజల న్యాయపరమైన ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం...

గ్రామసభ దరఖాస్తులపై నిర్లక్ష్యం

గ్రామసభ దరఖాస్తులపై నిర్లక్ష్యం బహిరంగ ప్రదేశంలో వదిలివేత పంచాయతీ తీరుపై గ్రామస్తుల ఆగ్రహం కాకతీయ, వరంగల్‌...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.