epaper
Sunday, October 4, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పట్టభద్రులు ఓటరుగా నమోదు కావాలి

పట్టభద్రులు ఓటరుగా నమోదు కావాలి

కాకతీయ, వరంగల్ బ్యూరో :రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం వరంగల్ సెంట్రల్ లైబ్రరీని సందర్శించిన ఆయన వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరుగా నమోదు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలకు భిన్నమైనవని అన్నారు. ఉన్నత విద్యావంతులు, మేధావులు, సమాజంపై అవగాహన కలిగిన పట్టభద్రులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారని తెలిపారు. అందువల్ల పట్టభద్రులు ఇచ్చే తీర్పుకు ఎంతో విలువ ఉంటుందని, తమ కోసం నిరంతరం పోరాడే వారికి మద్దతుగా నిలవాలని కోరారు. ఎన్నికల సమయంలో మాత్రమే హడావుడి చేసి, ఆ తర్వాత ప్రజలకు అందుబాటులో లేని వారికి ఓటుతో సమాధానం చెప్పాలన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో యూత్ డిక్లరేషన్ పేరుతో అనేక హామీలు ఇచ్చినా వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని రాకేష్ రెడ్డి విమర్శించారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మూడేళ్లు కావస్తున్నా, పది వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, రాజీవ్ యువ వికాసం, ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ, ప్రైవేట్ రంగంలో తెలంగాణ యువతకు 75 శాతం ఉద్యోగాలు, నిరుద్యోగ యువతకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, కళాశాల విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్ల వంటి హామీలను ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. యువత, నిరుద్యోగుల సమస్యలపై గత రెండేళ్లుగా తనతో పాటు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతోందని రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. జీవో 46 రద్దు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పాటు, జీవో 29 రద్దు కోసం కూడా పోరాటం చేశామని గుర్తుచేశారు. పట్టభద్రులు, నిరుద్యోగ యువత తమ ఓటు హక్కును వినియోగించుకునేలా తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ములుగు అదనపు ఎస్పీ కారును ఢీకొట్టిన టిప్పర్‌

ములుగు అదనపు ఎస్పీ కారును ఢీకొట్టిన టిప్పర్‌ కాకతీయ, ములుగు : ములుగు...

వర్ధన్నపేటలో 3 ఆలయాలకు ట్రస్ట్‌ బోర్డులు

వర్ధన్నపేటలో 3 ఆలయాలకు ట్రస్ట్‌ బోర్డులు ఒక్కో ఆలయానికి 5 మంది సభ్యులతో...

మాజీ సర్పంచ్‌ నుంచి వేధింపులు

మాజీ సర్పంచ్‌ నుంచి వేధింపులు 5 ఏళ్లుగా గ్రామం నుంచి వెళ్లిపోవాలంటూ ఇబ్బందులు సూరారం...

అక్రమ స్కానింగ్ కేంద్రాలపై దాడులు

అక్రమ స్కానింగ్ కేంద్రాలపై దాడులు రెండు పోర్టబుల్ మిషన్లు సీజ్ అనుమతి లేకుండా లింగ...

అధికారులు అలసత్వం వీడండి…. అభివృద్ధి పనులపై దృష్టి సారించండి

అధికారులు అలసత్వం వీడండి.... అభివృద్ధి పనులపై దృష్టి సారించండి ---- ఎమ్మెల్యే భూక్య...

ప్రజా ప్రభుత్వంతోనే ప్రజలు సుభిక్షంగా ఉన్నారు

ప్రజా ప్రభుత్వంతోనే ప్రజలు సుభిక్షంగా ఉన్నారు లబ్ధిదారులకు రూ.76 లక్షల కళ్యాణ లక్ష్మి,షాదీ...

ఏటూరునాగారంలో తక్షణమే కోర్టు ఏర్పాటు చేయాలి

ఏటూరునాగారంలో తక్షణమే కోర్టు ఏర్పాటు చేయాలి ప్రజల న్యాయపరమైన ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం...

గ్రామసభ దరఖాస్తులపై నిర్లక్ష్యం

గ్రామసభ దరఖాస్తులపై నిర్లక్ష్యం బహిరంగ ప్రదేశంలో వదిలివేత పంచాయతీ తీరుపై గ్రామస్తుల ఆగ్రహం కాకతీయ, వరంగల్‌...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.