ప్రజా ప్రభుత్వంతోనే ప్రజలు సుభిక్షంగా ఉన్నారు
లబ్ధిదారులకు రూ.76 లక్షల కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులు
పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా మురళి నాయక్
కాకతీయ, నెల్లికుదురు: ప్రజా ప్రభుత్వంతోనే రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ అన్నారు. శనివారం మండలంలోని రైతు వేదికలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి&షాదీ ముబారక్, సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా భూక్యా మురళి నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని
ఈ సందర్భంగా అర్హులైన 76 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున మొత్తం రూ.7,608,816 విలువైన కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్, 54 మంది లబ్ధిదారులకు 1,689,000 సిఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రజాప్రతినిధులు,అధికారులతో కలిసి ఎమ్మెల్యే డా మురళి నాయక్ గారు పంపిణీ చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. తాసిల్దార్ చందా నరేష్ ఎంపీడీవో సింగారపు కుమార్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు యాదవ రెడ్డి జిల్లా, మండలనాయకులు,
సర్పంచులు , అధికారులు,ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యూత్ నాయకులు పాల్గొన్నారు.

