మాజీ సర్పంచ్ నుంచి వేధింపులు
5 ఏళ్లుగా గ్రామం నుంచి వెళ్లిపోవాలంటూ ఇబ్బందులు
సూరారం గ్రామానికి చెందిన వెన్నపురెడ్డి అర్జున్ ఆరోపణలు
కాకతీయ, భూపాలపల్లి: తనను గ్రామం నుంచి వెళ్లిపోవాలంటూ 5 ఏళ్లుగా మాజీ సర్పంచ్ నాఫల అచ్చిరెడ్డి, ఆయన అనుచరులు వేధిస్తున్నారని సూరారం గ్రామానికి చెందిన వెన్నపురెడ్డి అర్జున్ ఒక పత్రిక ప్రకటనలో ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మీడియా బృందానికి రాసిన ఫిర్యాదులో పలు అంశాలను పేర్కొన్నారు.నాయకపోడు కులం పేరుతో దూషిస్తూ, చనిపోవాలంటూ బెదిరిస్తున్నారని, పార్టీ కార్యకర్తలతో తనపై నిఘా పెట్టి బయటకు వెళ్లినప్పుడు వెంబడిస్తున్నారని తెలిపారు. తనను రౌడీ, దొంగగా చిత్రీకరిస్తూ ఇతరులకు తనపై దాడి చేయాలని ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి వాట్సాప్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల గ్రూపుల్లో ప్రచారం చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఆసుపత్రులకు వెళ్లిన సమయంలోనూ తనకు హాని చేసేలా మందులు ఇవ్వాలని ఇతరులకు చెప్పారని, రోడ్లపై వెళ్లేటప్పుడు వాహనాలతో ఢీకొట్టి చంపుతామని బెదిరింపులు చేస్తున్నారని ఆరోపించారు. హోటళ్లలో ఆహారం, టీ ద్వారా విషప్రయోగం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉందని, వేధింపులపై సమగ్ర విచా

