నర్సింహులపేట దసరా ఉత్సవ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
కాకాకతీయ,మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో దసరా ఉత్సవ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ నూతన అధ్యక్షుడిగా ఎర్ర వెంకట్రామ్ నర్సయ్య, ప్రధాన కార్యదర్శిగా శామకురి శ్రీకాంత్ గౌడ్ ఎన్నికయ్యారు.
కమిటీ సభ్యులందరి సమక్షంలో నిర్వహించిన సమావేశంలో వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ… దసరా నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన కమిటీ సభ్యులకు, గ్రామస్థులకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

