epaper
Monday, October 5, 2026
epaper
BREAKING NEWS
Loading News...

జ‌నం గుండెల్లో జెండా ఎగురేస్తాం

జ‌నం గుండెల్లో జెండా ఎగురేస్తాం
ప్ర‌జాస్వామిక వాదులమంతా ఒక్క‌ట‌వుతాం
జన తెలంగాణ పేరుతో కొత్త రాజకీయ వేదికకు సన్నాహాలు
ప్రజాస్వామికవాదుల సమీకరణ ప్ర‌య‌త్నాలు
రెండు మూడు నెలల్లో పార్టీ పేరు ఖరారు
కాంగ్రెస్‌.. బీఆర్‌ఎస్‌.. బీజేపీలకు ప్రత్యామ్నాయమే మా లక్ష్యం
ప్రజా సమస్యలే ఎజెండా.. విద్య, వైద్యం, ఉపాధిపై పోరాటం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు కసరత్తు
తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌తోనే ఆకాంక్షలు నెరవేరలేదు
పాలకులు కమిషన్‌ ఏజెంట్లుగా మారారు
ప్రజలే రాజకీయ ప్రత్యామ్నాయాన్ని నడపాలన్న‌ది ఆకాంక్ష‌
తెలంగాణ డిజిటల్‌ మీడియా ప్రతినిధులతో మాజీ మావోయిస్టు నేత, తెలంగాణ ఉద్యమకారుడు లంకా పాపిరెడ్డి చిట్‌చాట్‌

తెలంగాణలో మరో రాజకీయ వేదికకు కసరత్తు మొదలైంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ప్రజా సమస్యలను కేంద్రంగా చేసుకుని కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు మాజీ మావోయిస్టు నేత, తెలంగాణ ఉద్యమకారుడు లంకా పాపిరెడ్డి ప్రకటించారు. ‘జన తెలంగాణ’ లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తామని.. విద్య, వైద్యం, ఉపాధి ప్రధాన ఎజెండాగా ఉద్యమాలు నిర్మిస్తామని వెల్లడించారు. తెలంగాణ సాధించినా ప్రజలు ఆశించిన మార్పు రాలేదని, రాష్ట్ర సాధన వెనుక ఉన్న ఆకాంక్షలు నెరవేరలేదని అన్నారు. పాలకులు ప్రజా ప్రయోజనాల కంటే కమీషన్‌ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలపై ప్రజల్లో అసంతృప్తి ఉందని పేర్కొంటూ.. ఆ ఖాళీని ప్రజాస్వామిక రాజకీయ ప్రత్యామ్నాయంతో భర్తీ చేయాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. ఉమ్మడి జిల్లాల కేంద్రంగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ వివిధ వర్గాలను సమీకరిస్తున్నామని, రెండు మూడు నెలల్లో పార్టీ పేరు ఖరారయ్యే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ డిజిటల్‌ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో తన రాజకీయ ఆలోచనలు, భవిష్యత్‌ కార్యాచరణపై లంకా పాపిరెడ్డి మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

మార్పు కోసం మరో రాజకీయ వేదిక అవసరం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల జీవితాల్లో ఆశించిన స్థాయిలో మార్పు రాలేదు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు ఏ ఆకాంక్షలతో పోరాడారో.. ఏ త్యాగాలు చేశారో.. ఆ లక్ష్యాలు పూర్తిగా నెరవేరలేదు. రాష్ట్రం ఏర్పడితే మన వనరులు మనకు ఉపయోగపడతాయని, యువతకు ఉద్యోగాలు వస్తాయని, విద్య, వైద్యం మెరుగుపడతాయని భావించాం. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించలేకపోయాయి. అందుకే ప్రజల సమస్యల ఆధారంగా కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని భావిస్తున్నాం. ఇది ఎవరికీ వ్యతిరేకంగా వ్యక్తిగత రాజకీయ ప్రయోగం కాదు. ప్రజా సమస్యలను రాజకీయ ఎజెండాగా మార్చే ప్రయత్నం. ప్రజాస్వామిక పద్ధతిలో కొత్త పార్టీని నిర్మించి ‘జన తెలంగాణ’ దిశగా ముందుకు వెళ్లాలన్నది మా ఆలోచన.

మూడు పార్టీలకు భిన్నమైన ఎజెండాతో జనంలోకి

ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ పోటీ కొనసాగుతోంది. కానీ ప్రజల మౌలిక సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. నిరుద్యోగం, విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలపై ప్రజలకు స్పష్టమైన పరిష్కారాలు కావాలి. అందుకే సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అంశాలనే మా రాజకీయ చర్చకు కేంద్రంగా చేయాలనుకుంటున్నాం. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామిక రాజకీయ వేదికను నిర్మిస్తాం. వ్యక్తుల చుట్టూ కాకుండా ప్రజా సమస్యల చుట్టూ రాజకీయాలను నడపాలి. అధికారమే లక్ష్యంగా కాకుండా ప్రజా ఉద్యమాల నుంచి రాజకీయ నిర్మాణం రావాలన్నదే మా ఉద్దేశం.

విద్య, వైద్యం, ఉపాధి.. మూడు ప్రధాన పోరాటాలు

ప్రజలకు అత్యంత అవసరమైనవి విద్య, వైద్యం, ఉపాధి. ఈ మూడు రంగాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. విద్యారంగాన్ని పాలకులు నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వ వైద్య రంగాన్ని గాలికి వదిలేశారు. వైద్య రంగంలో కార్పొరేట్‌ ఆధిపత్యం పెరిగింది. ఉపాధి పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ముప్పై ఏళ్లు వచ్చినా యువతకు ఉద్యోగం లేక, ఉపాధి లేక ఇబ్బందులు పడుతోంది. గ్రామాల్లో అప్రత్యక్ష నిరుద్యోగం విస్తరిస్తోంది. వ్యవసాయం సంక్షోభంలో ఉంది. పరిశ్రమలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. కేవలం సర్వీస్‌ సెక్టార్‌ను చూపించి అదే అభివృద్ధి అని చెప్పడం వల్ల ప్రజల జీవితాల్లో స్థిరమైన మార్పు రాదు. వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, వైద్యం, ఉపాధి రంగాల బలోపేతమే మా కార్యాచరణకు కేంద్రంగా ఉంటుంది. తెలంగాణలో పాలకులు కమీషన్‌ ఏజెంట్లుగా మారిపోయారని నేను భావిస్తున్నాను. కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ ప్రజా ప్రయోజనాలను పక్కన పెడుతున్నారు. రాష్ట్ర సంపద, వనరులు, అభివృద్ధి ప్రయోజనాలు ప్రజలకు చేరాలి. కానీ వ్యవసాయం, పరిశ్రమలు బలోపేతం కాకుండా కేవలం సర్వీస్‌ సెక్టార్‌ను అభివృద్ధిగా చూపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ప్రశ్నించాలి. ప్రజల సమస్యలపై ఉద్యమాలు నిర్మించాలి. నిజాయితీగా పనిచేస్తే ప్రజలే మన వెంట వస్తారు. డబ్బు లేకపోయినా ప్రజల నమ్మకం ఉంటే ఉద్యమం నిర్మించవచ్చు. చరిత్రలో అనేక ప్రజా ఉద్యమాలు దీనినే నిరూపించాయి.

రెండు మూడు నెలల్లో పార్టీ రూపురేఖలు

కొత్త రాజకీయ పార్టీ నిర్మాణం కాగితాలపై మాత్రమే జరగదు. ప్రజల్లోకి వెళ్లి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలి. అందుకే తెలంగాణవ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల కేంద్రంగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్‌లో సమావేశాలు చేపట్టాం. వివిధ వర్గాల ప్రజల నుంచి స్పందన వస్తోంది. ప్రజాస్వామికవాదులు, ప్రజా సమస్యలపై పనిచేస్తున్న వ్యక్తులు, వివిధ సామాజిక వర్గాలను ఒకే వేదికపైకి తీసుకురావాలని నిర్ణయించాం. ఈ సమావేశాల ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించి, పార్టీ విధివిధానాలను రూపొందిస్తాం. ప్రజల భాగస్వామ్యంతోనే జన తెలంగాణ నిర్మాణం జరగాలి. ప్రస్తుతం పార్టీ నిర్మాణానికి సంబంధించిన సన్నాహక ప్రక్రియ కొనసాగుతోంది. రానున్న రెండు మూడు నెలల్లో పార్టీ పేరు పూర్తిస్థాయిలో ఖరారయ్యే అవకాశం ఉంది. పార్టీ పేరు కంటే ముందు దాని విధానం, ప్రజల పట్ల బాధ్యత, కార్యాచరణ స్పష్టంగా ఉండాలి. వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, వైద్యం, ఉపాధిని కేంద్రంగా చేసుకుని విధానాలను రూపొందిస్తాం. ప్రజల సమస్యలపై పోరాటాలు నిర్మించి, ఆ పోరాటాల నుంచే రాజకీయ శక్తిని నిర్మించాలన్నది మా ఆలోచన. ప్రజాస్వామికవాదులందరినీ కలుపుకుంటాం. తెలంగాణ కోసం జరిగిన పోరాటాల స్ఫూర్తిని ప్రజా సమస్యల పరిష్కారానికి మళ్లించాలి.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి రాజకీయ పరీక్ష

రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. పట్టభద్రుల సమస్యలను దగ్గరగా తెలుసుకోవడం, వారి అభిప్రాయాలను వినడం, కొత్త రాజకీయ వేదికను వారిలోకి తీసుకెళ్లడం ఈ ప్రయత్నంలో ప్రధాన ఉద్దేశం. ఎన్నికలు కేవలం ఓట్ల కోసం మాత్రమే కాకుండా ప్రజా సమస్యలను రాజకీయ చర్చలోకి తీసుకురావడానికి కూడా ఒక వేదిక కావాలి. యువతలో నిరుద్యోగం, ఉద్యోగ భద్రత, విద్యా అవకాశాలు, ఉపాధి వంటి అంశాలను విస్తృతంగా చర్చిస్తాం. ఈ ఎన్నికల ద్వారా పట్టభద్రులకు మరింత దగ్గర కావాలన్నది ప్రస్తుతం మా ముందున్న లక్ష్యం. తెలంగాణ సాధించినప్పుడు ప్రజలు ఒక కొత్త జీవితాన్ని ఆశించారు. ఆ ఆశలు ఇంకా పూర్తిగా నెరవేరలేదన్న భావన ప్రజల్లో ఉంది. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పే రాజకీయ ప్రక్రియ అవసరం. ప్రజలను కేవలం ఎన్నికల సమయంలో గుర్తుచేసుకునే రాజకీయాలకు భిన్నంగా.. నిరంతరం ప్రజల మధ్య ఉండే రాజకీయ వేదికను నిర్మించాలి. ప్రజల సమస్యలపై పోరాడాలి. ప్రజలే ఉద్యమాలను నిర్మించాలి. ప్రజలే రాజకీయ ప్రత్యామ్నాయాన్ని బలోపేతం చేయాలి. అందుకే ‘జన తెలంగాణ’ దిశగా అడుగులు వేస్తున్నాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరే వరకు ప్రజాస్వామిక పద్ధతిలో మా ప్రయాణం కొనసాగుతుంది.

ఉద్యమ నేపథ్యం.. రాజకీయ ప్రయాణానికి పునాది

నా రాజకీయ ప్రయాణం చిన్ననాటి నుంచే ఉద్యమ నేపథ్యంతో సాగింది. మాది దామెర మండలం తక్కళ్లపాడు. పుట్టి పెరిగింది వరంగల్‌ ఆజంజాహి మిల్స్‌ కాలనీ పక్కన ఉన్న గాంధీనగర్‌లో. నాన్న అనంతరెడ్డి స్వాతంత్య్ర సమరయోధుడు. చిన్నపెద్దనాన్న కమ్యూనిస్టు భావజాలంతో ఉండేవారు. అన్న మురళీమోహన్‌రెడ్డి ప్రభావంతో చిన్న వయసులోనే వామపక్ష భావజాలం వైపు ఆకర్షితుడినయ్యాను. 1976లో సుమారు 14 ఏళ్ల వయసులో అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లి అరెస్టయ్యాను. అనంతరం 1981లో మళ్లీ అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లి పీపుల్స్‌వార్‌ ఉద్యమంలో దళసభ్యుడిగా, కమాండర్‌గా, జిల్లా కార్యదర్శిగా, సెంట్రల్‌ కమిటీ సభ్యుడిగా వివిధ బాధ్యతలు చేపట్టాను. 2008లో అనారోగ్య కారణాలతో అప్పటి హోంశాఖ మంత్రి జానారెడ్డి ముందు లొంగిపోయాను. 2009 నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్నాను. ఈ ఉద్యమ అనుభవాలే ప్రస్తుతం ప్రజా సమస్యల ఆధారంగా రాజకీయ ప్రత్యామ్నాయం నిర్మించాలన్న ఆలోచనకు పునాది.

ఉత్త‌రం కాక‌తీయ ఎడిట‌ర్‌
అరెల్లి కిర‌ణ్ గౌడ్‌
-7396604266

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేతన కోతతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో ఆందోళన

వేతన కోతతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో ఆందోళన జీఓ 1181ను నిలిపివేయాలని జిడబ్ల్యూ...

పెళ్లి చేసుకునే వరకు ఇక్కడే ఉంటా!

పెళ్లి చేసుకునే వరకు ఇక్కడే ఉంటా! ప్రియుడి ఇంటి ముందు టెంట్‌ వేసి...

జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామా చేయాలి

జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామా చేయాలి కేంద్రం గుప్పిట్లోకి ఎన్నికల సంఘం ఓటు హక్కును...

నర్సింహులపేట దసరా ఉత్సవ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

నర్సింహులపేట దసరా ఉత్సవ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక కాకాకతీయ,మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా...

ములుగు అదనపు ఎస్పీ కారును ఢీకొట్టిన టిప్పర్‌

ములుగు అదనపు ఎస్పీ కారును ఢీకొట్టిన టిప్పర్‌ కాకతీయ, ములుగు : ములుగు...

వర్ధన్నపేటలో 3 ఆలయాలకు ట్రస్ట్‌ బోర్డులు

వర్ధన్నపేటలో 3 ఆలయాలకు ట్రస్ట్‌ బోర్డులు ఒక్కో ఆలయానికి 5 మంది సభ్యులతో...

మాజీ సర్పంచ్‌ నుంచి వేధింపులు

మాజీ సర్పంచ్‌ నుంచి వేధింపులు 5 ఏళ్లుగా గ్రామం నుంచి వెళ్లిపోవాలంటూ ఇబ్బందులు సూరారం...

అక్రమ స్కానింగ్ కేంద్రాలపై దాడులు

అక్రమ స్కానింగ్ కేంద్రాలపై దాడులు రెండు పోర్టబుల్ మిషన్లు సీజ్ అనుమతి లేకుండా లింగ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.