పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి భరోసా!
* మాజీ సీఎం కేసీఆర్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం
* శనిగరం సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య
కాకతీయ,కోహెడ: పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో గొప్పదని శనిగరం గ్రామ సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య అన్నారు. శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కళ్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ.. పేదింటి ఆడపిల్లల వివాహాల కోసం పైసా ఖర్చు లేకుండా ఆర్థిక సహాయం అందించాలనే గొప్ప ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ పథకం పేద కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తోందని, ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థికంగా అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.పేద ప్రజల సంక్షేమం కోసం కళ్యాణ లక్ష్మి వంటి పథకాన్ని ప్రవేశపెట్టిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని లక్ష్మయ్య అన్నారు. ఇలాంటి సంక్షేమ పథకాలు పేద కుటుంబాల జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్నాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బుచ్చయ్య, ఆర్ ఐ, జీపిఓ,వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, లబ్ధిదారులు,తదితరులు పాల్గొన్నారు.

