epaper
Tuesday, October 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

రైతులకు 3 ఫేజ్‌ కరెంట్‌ ఇవ్వాల్సిందే!

రైతులకు 3 ఫేజ్‌ కరెంట్‌ ఇవ్వాల్సిందే!
విద్యుత్‌ కోతలతో పంట నష్టంపై సీపీఎం ఆందోళన
నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల పరిహారం ఇవ్వాలి
సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి అముదాల మల్లారెడ్డి డిమాండ్‌

కాకతీయ, చేర్యాల : వ్యవసాయానికి నిరంతరాయంగా మూడు ఫేజ్‌ల విద్యుత్‌ సరఫరా చేయాలని, విద్యుత్‌ కోతలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం చెల్లించాలని సీపీఎం నాయకులు డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేర్యాలలో సీపీఎం ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఏడీఈ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం విద్యుత్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఏడీఈ వెంకట్‌గౌడ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి అముదాల మల్లారెడ్డి మాట్లాడుతూ సాగు సమయంలో రైతులకు నిరంతరాయంగా మూడు ఫేజ్‌ల విద్యుత్‌ అందించడం ప్రభుత్వ బాధ్యతని అన్నారు. విద్యుత్‌ కోతల కారణంగా పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, ఎకరాకు రూ.20 వేల పరిహారం చెల్లించాలని కోరారు. రైతుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే విద్యుత్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్తులో విద్యుత్‌ కోతలతో రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం, అధికారులు తగిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, వివిధ మండలాల నాయకులు, శాఖ కార్యదర్శులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అంబేద్కర్‌ ఆశయ సాధనే లక్ష్యం

అంబేద్కర్‌ ఆశయ సాధనే లక్ష్యం కాకతీయ, చేర్యాల: డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌, మహాత్మా...

వైద్య విద్యలో ప్రీతి ప్రతిభ

వైద్య విద్యలో ప్రీతి ప్రతిభ ఎండీ కమ్యూనిటీ మెడిసిన్‌లో నాలుగో ర్యాంకు నాగ్‌పూర్‌ ప్రభుత్వ...

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలి

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలి తొలగించిన ఓటర్ల పేర్లను తిరిగి నమోదు చేయాలి ఎన్నికల ప్రధాన...

పోక్సో కేసులో ఏడుగురు అరెస్ట్‌!

పోక్సో కేసులో ఏడుగురు అరెస్ట్‌! నిందితులకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ డ్రగ్స్‌ పరీక్షల్లో ప్రతికూల ఫలితాలు చేర్యాల...

పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి భరోసా!

పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి భరోసా! * మాజీ సీఎం కేసీఆర్‌కు...

విద్యార్థులకు పోలీస్ విధులపై అవగాహన

విద్యార్థులకు పోలీస్ విధులపై అవగాహన * చేర్యాల పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులకు ఓపెన్...

పండుగ సాయన్న ఆశయాలను నెర‌వేర్చాలి

పండుగ సాయన్న ఆశయాలను నెర‌వేర్చాలి జనగామ కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి కాకతీయ,...

కార్మికుల జీతాలు పెంచాల్సిందే!

కార్మికుల జీతాలు పెంచాల్సిందే! సిద్దిపేట స్వచ్ఛత వెనుక పారిశుధ్య కార్మికుల రెక్కల కష్టమే కాంగ్రెస్‌...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.