బహుజన ఆత్మగౌరవ ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్!
పాపన్న పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలి
కాంగ్రెస్ ఓబీసీ సెల్ జాతీయ కన్వీనర్ కత్తి వెంకటస్వామి గౌడ్ పిలుపు
హనుమకొండ గౌడ హాస్టల్లో విగ్రహావిష్కరణ
కాకతీయ, హన్మకొండ : బహుజనుల ఆత్మగౌరవం, సమానత్వం కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్ ఓబీసీ సెల్ జాతీయ కన్వీనర్ కత్తి వెంకటస్వామి గౌడ్ పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధి కోసం బహుజనులంతా ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. హనుమకొండ హంటర్ రోడ్డులోని కాకతీయ గౌడ హాస్టల్లో విగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పాపన్న గౌడ్ బహుజన వర్గాల ఆత్మగౌరవం, హక్కులు, సామాజిక పురోగతి కోసం చేసిన పోరాటాలు స్ఫూర్తిదాయకమని కత్తి వెంకటస్వామి గౌడ్ పేర్కొన్నారు. ఆయన జీవిత చరిత్రను యువత తెలుసుకోవాలని, ఆశయాలకు అనుగుణంగా సమాజంలో ఐక్యత, సమానత్వం, సేవాభావాన్ని పెంపొందించుకోవాలని కోరారు. గౌడ హాస్టల్లో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పాపన్న చరిత్ర, పోరాట స్ఫూర్తిని భావితరాలకు పరిచయం చేసే అవకాశం కలిగిందని నిర్వాహకులు తెలిపారు. విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు అనంతుల రమేష్ గౌడ్, జూలూరి రంజిత్ గౌడ్, మార్క రవి గౌడ్, కూనూరు రంజిత్ గౌడ్, డాక్టర్ సోల్తి కిరణ్ గౌడ్, మాచర్ల శరత్ గౌడ్‌తో పాటు గౌడ సంఘం నాయకులు పులి శ్రీనివాస్ గౌడ్, జనార్దన్ గౌడ్, మోహన్ గౌడ్, బొనగాని యాదగిరి గౌడ్, బైరి రవికృష్ణ గౌడ్, తీగల జీవన్ గౌడ్, స్వామి గౌడ్, అశోక్ గౌడ్, పెరుమాండ్ల వెంకట్ గౌడ్, టీవీ రాజ్ గౌడ్, యుగేందర్ గౌడ్, హరీష్ గౌడ్, జగన్ గౌడ్, మార్క విజయ్‌కుమార్ గౌడ్, సంజయ్ గౌడ్, సోల్తి సారయ్య గౌడ్, ఏకాంతం గౌడ్, గోపి గౌడ్, రాంకీ గౌడ్, సాగర్ గౌడ్, విజయ్ గౌడ్, కుమార్ గౌడ్, తేజ తదితరులు పాల్గొన్నారు.

