epaper
Tuesday, October 27, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కేశవపట్నంలో పారిశుధ్యం పడకేసింది!

కేశవపట్నంలో పారిశుధ్యం పడకేసింది!
మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్త..
దోమల విజృంభణతో ప్రజలకు విషజ్వరాల ముప్పు
పట్టించుకోని అధికారులు..
రోగాల బారిన పడితేనే స్పందిస్తారా?

కాకతీయ,శంకరపట్నం:శంకరపట్నం మండలంలోని కేశవపట్నం గ్రామంలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని పలు వార్డుల్లో మురుగు కాలువలు శుభ్రం చేయకపోవడంతో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. మురుగునీరు నిలిచిపోవడంతో దోమలు విపరీతంగా వృద్ధి చెందుతున్నాయని, దీంతో ప్రజలు అనారోగ్య సమస్యలతో ఆందోళన చెందుతున్నారని స్థానికులు వాపోతున్నారు.

మురుగు కాలువలే దోమలకు ఆవాసాలు!

గ్రామంలోని పలు వీధుల్లో పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించకపోవడంతో మురుగు కాలువలు అధ్వానంగా మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాలువల్లో పూడిక తీయకపోవడం, చెత్తను తొలగించకపోవడం వల్ల దోమల బెడద రోజురోజుకూ పెరుగుతోందని ప్రజలు అంటున్నారు. ఇప్పటికే విషజ్వరాల భయం వెంటాడుతుండగా, దోమల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజల ఆరోగ్యంపై అధికారులకు పట్టింపు లేదా?

పారిశుధ్యం సక్రమంగా లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాధులు ప్రబలిన తర్వాత హడావుడి చేయడం కంటే ముందుగానే నివారణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొంటున్నారు. గ్రామంలో పారిశుధ్య పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా స్పందించాలి!

సంబంధిత గ్రామపంచాయతీ అధికారులు తక్షణమే స్పందించి అన్ని వార్డుల్లో మురుగు కాలువలను శుభ్రం చేయాలని, పేరుకుపోయిన చెత్తను తొలగించాలని, దోమల నివారణకు ఫాగింగ్‌తో పాటు తగిన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంలో అధికారులు ఇకనైనా నిర్లక్ష్యాన్ని వీడి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు

గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు అభివృద్ధి పనులు, బిల్లులపై సమగ్ర విచారణ...

రెండో విడత దళితబంధు వెంటనే అమలు చేయాలి

రెండో విడత దళితబంధు వెంటనే అమలు చేయాలి ఎంపికైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం...

మానాల పాఠశాల విద్యార్థులకు ఉచితంగా షూల పంపిణీ

మానాల పాఠశాల విద్యార్థులకు ఉచితంగా షూల పంపిణీ కాకతీయ, రుద్రంగి: రుద్రంగి మండలం...

నిరుపేద కుటుంబానికి సీఎం సహాయనిధి అండ

నిరుపేద కుటుంబానికి సీఎం సహాయనిధి అండ దాసరి స్వామి వైద్యానికి రూ.3 లక్షల...

అక్రమంగా మొరం రవాణా.. టిప్పర్‌ పట్టివేత

అక్రమంగా మొరం రవాణా.. టిప్పర్‌ పట్టివేత అనుమతులు లేకుండా తరలిస్తుండగా గుర్తింపు అక్రమ రవాణాపై...

అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి

అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి కానిస్టేబుల్‌ గుజ్జెటి మహేశ్‌కు ఎమ్మెల్యే, సీపీ నివాళి అమరుడి కుటుంబానికి...

ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు కేశవపట్నం విద్యార్థినులు ఎంపిక

ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు కేశవపట్నం విద్యార్థినులు ఎంపిక విద్యార్థినులను అభినందించిన...

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం కరీంనగర్‌ సీపీ గౌష్‌ ఆలం సవరన్‌ మసీదులో ప్రత్యేక...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.