epaper
Tuesday, November 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పరకాల రాజకీయాల్లో ఫ్లెక్సీ ఫైట్‌!

పరకాల రాజకీయాల్లో ఫ్లెక్సీ ఫైట్‌!
పోచంపల్లి వర్సెస్‌ చల్లా వ‌ర్గీయుల మ‌ధ్య రాజ‌కీయ పోరు
ప‌ర‌కాల బీఆర్‌ఎస్‌లో బహిర్గతమైన విభేదాలు
ఎమ్మెల్సీ ఫ్లెక్సీలు చించివేతతో మొదలైన వివాదం
చల్లా పేరు ప్రస్తావించకుండానే మాట్లాడిన ఎమ్మెల్సీ పోచంపల్లి
స్థానికతను ప్రస్తావిస్తూ పరకాలకు పూర్వ వైభవం తెస్తానని ప్రకటన
ప్రతి ఇంటికీ అండగా ఉంటానంటూ వ్యాఖ్యలు

కాకతీయ, హనుమకొండ : పరకాల బీఆర్‌ఎస్‌ రాజకీయాల్లో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వర్గాల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పోచంపల్లి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్‌ టోర్నమెంట్‌ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఫ్లెక్సీల వివాదం రాజకీయ వేడిని పెంచింది. టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా పోచంపల్లి హాజరయ్యే నేపథ్యంలో ఆయన ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా, వాటిలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఫొటో లేదంటూ ఆయన అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోచంపల్లి వర్గీయులతో వాగ్వాదానికి దిగిన చల్లా వర్గీయులు ఫ్లెక్సీలను చించివేసినట్లు సమాచారం. దీంతో పరకాలలో ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే వర్గాల మధ్య ఆధిపత్య పోరు మరోసారి తెరపైకి వచ్చింది. ఫ్లెక్సీల వివాదం నడుమ క్రికెట్‌ టోర్నమెంట్‌కు హాజరైన పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తన ప్రసంగంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేరును నేరుగా ప్రస్తావించలేదు. ఫ్లెక్సీల వ్యవహారంలో జరిగిన ఘటనను సంబంధిత వ్యక్తుల విజ్ఞతకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు. నిర్వాహకులను అభినందిస్తూ క్రీడా కార్యక్రమాలకు రాజకీయ వివాదాలను ఆపాదించవద్దన్న సంకేతాలిచ్చారు. అయితే సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు స్థానిక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

స్థానికతను తెరపైకి తెచ్చిన ఎమ్మెల్సీ

తాను పరకాలలో పుట్టిన బిడ్డనని, ఈ ప్రాంతంతో తనకు విడదీయలేని అనుబంధం ఉందని పోచంపల్లి పేర్కొన్నారు. స్థానికుడిగా పరకాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. వ్యాపార, వాణిజ్య వర్గాల విజ్ఞప్తి మేరకే తాను స్థానిక కార్యక్రమాలకు హాజరవుతున్నానని, పరకాలలో ప్రతి ఇంటికీ అండగా ఉండటమే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. చల్లా ధర్మారెడ్డి పేరును ప్రస్తావించకుండానే స్థానికత అంశాన్ని ప్రస్తావించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వాహకులు పోచంపల్లిని ఆహ్వానించడంతో ఆయన ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి సమాచారం ఇవ్వలేదని, ఆయన ఫొటోను ఫ్లెక్సీల్లో పెట్టలేదని చల్లా వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఫ్లెక్సీలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో పరకాల పట్టణంలో బీఆర్‌ఎస్‌ అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నాయకుల వర్గాల మధ్య నెలకొన్న విభేదాలు బహిరంగ కార్యక్రమాలకూ విస్తరించడం స్థానిక రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. పోచంపల్లి వ్యాఖ్యలు, చల్లా వర్గం అభ్యంతరాలు, ఫ్లెక్సీల వివాదం నేపథ్యంలో పరకాల బీఆర్‌ఎస్‌లో ఆధిపత్య పోరు ఎటువైపు దారితీస్తుందన్న ఆసక్తి నెలకొంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఒకచోట పరీక్షలు.. మరోచోట చెల్ల‌వంట‌

ఒకచోట పరీక్షలు.. మరోచోట చెల్ల‌వంట‌ ఖమ్మంలో ప్రైవేటు ఆసుపత్రుల ఇష్టారాజ్యం రోగులపై అదనపు ఆర్థిక...

రఘునాథపల్లిలో భారీ చోరీ

రఘునాథపల్లిలో భారీ చోరీ అంగన్‌వాడీ టీచర్‌ ఇంట్లో దొంగల బీభత్సం బంగారు...

చిన్ననాగారంలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు

చిన్ననాగారంలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు జన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద...

పాకాల సరస్సులో ఇద్దరు చిన్నారులతో కలిసి వివాహిత ఆత్మహత్య

పాకాల సరస్సులో ఇద్దరు చిన్నారులతో కలిసి వివాహిత ఆత్మహత్య *మృతురాలు గీసుగొండ మండలం...

రామప్ప బొగ్గు గనిపై ఎన్‌జీటీ సుమోటో కేసు!

రామప్ప బొగ్గు గనిపై ఎన్‌జీటీ సుమోటో కేసు! వారసత్వ కట్టడం సమీపంలో గని...

పది పాఠశాలలకు చేరని సీఎం బ్రేక్‌ఫాస్ట్‌!

పది పాఠశాలలకు చేరని సీఎం బ్రేక్‌ఫాస్ట్‌! అల్పాహారం అందక ఆకలితోనే తరగతి గదుల్లో...

ఇనుగుర్తి ఫారెస్ట్ బౌండరీల గుర్తింపు..

ఇనుగుర్తి ఫారెస్ట్ బౌండరీల గుర్తింపు.. అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు తొర్రూర్...

పేదల గుడిసెలు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా?

  పేదల గుడిసెలు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా? వైఎస్సార్‌ నగర్‌ వాసులకు వెంటనే పట్టాలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.