చిన్ననాగారంలో ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు
జన నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
పేద ప్రజల సంక్షేమమే సీఎం లక్ష్యం
—– మండల అధ్యక్షులు బైరు అశోక్ గౌడ్
కాకతీయ, ఇనుగుర్తి:
పేద ప్రజల సంక్షేమమే సీఎం లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బైరు అశోక్ గౌడ్ అన్నారు. ఆదివారం ఇనుగుర్తి మండలం లోని చిననాగారం గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయం ఆవరణంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ఉప సర్పంచ్ తుమ్మనపల్లి సతీష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల అధ్యక్షుడు బైర్ అశోక్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న జననాయకుడు రేవంత్ రెడ్డి కి . మండల ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ
పేద ప్రజల సంక్షేమం, పేద రైతుల అభ్యున్నతి, విద్యా మరియు వైద్య రంగాల అభివృద్ధే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని,సన్న బియ్యం పథకం, ఆరోగ్యశ్రీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కొత్త రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, రైతుల సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు ద్వారా పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తూ, విద్యా మరియు వైద్య రంగాలకు ప్రాధాన్యతనిస్తున్నారు.
నవంబర్ 19 నుంచి అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ బీమా వంటి సంక్షేమ కార్యక్రమాలతో పేద కుటుంబాలకు భరోసా కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

