క్రికెట్ మైదానంలో సీఐ సిక్సర్ల మోత…
*47 బంతుల్లో 90 పరుగులతో చెలరేగిన వరంగల్ పోలీస్ జట్టు కెప్టెన్ విశ్వేశ్వర్…
*10 సిక్సర్లు, 5 ఫోర్లతో అజేయ ఇన్నింగ్స్…
కాకతీయ, గీసుగొండ: క్రికెట్ మైదానంలో వరంగల్ పోలీస్ జట్టు కెప్టెన్, సీఐ విశ్వేశ్వర్ తన బ్యాటింగ్‌తో సత్తా చాటారు. త్వరలో జరగనున్న ఐదవ తెలంగాణ రాష్ట్ర పోలీస్ క్రీడా పోటీలకు సన్నాహకంగా ఏడు పోలీస్ బెటాలియన్ల క్రీడాకారులతో కూడిన రేంజ్-1 పోలీస్ జట్టుతో వరంగల్ పోలీస్ జట్టు సాధన మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో వరంగల్ పోలీస్ జట్టు కెప్టెన్ విశ్వేశ్వర్ బ్యాట్‌తో చెలరేగిపోయారు. కేవలం 47 బంతుల్లో 5 ఫోర్లు, 10 భారీ సిక్సర్లతో అజేయంగా 90 పరుగులు సాధించి ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు. బంతిని బౌండరీ దాటిస్తూ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించారు. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో మ్యాచ్‌లో ఉత్తమ బ్యాటర్‌గా నిలవడంతో పాటు 8.95 అత్యుత్తమ ఆటగాడి రేటింగ్ సాధించారు. విశ్వేశ్వర్ మెరుపు ఇన్నింగ్స్ వరంగల్ పోలీస్ జట్టులో నూతనోత్సాహాన్ని నింపింది. రాబోయే రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో సత్తా చాటేందుకు జట్టుకు మరింత ఆత్మవిశ్వాసాన్ని అందించింది.

