epaper
Wednesday, November 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

అటవీ శాఖలో అధికారి పెత్తనం!

అటవీ శాఖలో అధికారి పెత్తనం!
వివాదాస్పద వ్యవహారశైలితో సిబ్బందిలో కలవరం
రెండు డివిజన్ల బాధ్యతలు.. పర్యవేక్షణపై ప్రశ్నలు
ఆరు నెలల్లో వరుస సస్పెన్షన్లు.. క్షేత్రస్థాయి అధికారులపై ఒత్తిడి
ఎఫ్‌డీవో వెంకటేశ్వరరావు తీరుపై ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి

కాకతీయ, తెలంగాణ బ్యూరో : మహబూబాబాద్‌ జిల్లా అటవీ శాఖలో అధికారుల మధ్య సమన్వయ లోపం, ఉన్నతాధికారి వ్యవహారశైలి, వరుస సస్పెన్షన్లతో ఉద్యోగ వర్గాల్లో ఆందోళన వ్య‌క్త‌మ‌వుతోంది. రెండు డివిజన్ల బాధ్యతలు నిర్వహిస్తున్న ఎఫ్‌డీవో వెంకటేశ్వరరావు తీరుపై క్షేత్రస్థాయి సిబ్బందిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. విధుల నిర్వహణలో తగిన మార్గదర్శకాలు, పర్యవేక్షణ, సమన్వయం కొరవడుతున్నాయని.. మరోవైపు చిన్నపాటి ఘటనలకు కూడా కింది స్థాయి అధికారులే బాధ్యత వహించాల్సి వస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు. మహబూబాబాద్‌ జిల్లాలో మహబూబాబాద్‌, గూడూరు రెండు అటవీ డివిజన్లు ఉన్నాయి. మహబూబాబాద్‌ ఎఫ్‌డీవోగా పనిచేస్తున్న వెంకటేశ్వర‌రావు గూడూరు డివిజన్‌ ఇన్‌చార్జి బాధ్యతలూ నిర్వహిస్తున్నారు. గూడూరు, కొత్తగూడ, గంగారం, బయ్యారం రేంజ్‌ల పరిధిలో జిల్లాలోని సుమారు 85 నుంచి 90 శాతం అటవీ ప్రాంతం ఉంది. విస్తారమైన అటవీ ప్రాంతం, కీలకమైన కోర్‌ ఫారెస్ట్‌ పరిధి పర్యవేక్షణ బాధ్యతలు ఒకే అధికారి వద్ద ఉండటంతో క్షేత్రస్థాయిలో సమన్వయం, పర్యవేక్షణ గాడి త‌ప్పంద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. విధుల నిర్వహణలో స్పష్టమైన ఆదేశాలు, మార్గదర్శకాలు లేకపోవడం వల్లే కొన్ని సందర్భాల్లో కింది స్థాయి అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

వరుస సస్పెన్షన్లతో కలవరం

గత ఆరు నెలల్లో గూడూరు పరిధిలో చోటుచేసుకున్న ఘటనల్లో న‌లుగురు అధికారులు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇటీవల మామిడి తోటల నరికివేత, కలప అక్రమ రవాణా వ్యవహారంలో డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌తోపాటు మరో ముగ్గురిపై చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో క్షేత్రస్థాయి అధికారుల బాధ్యత ఎంత? పర్యవేక్షణ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? అనే అంశాలపై ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఒకవైపు అటవీ అక్రమాల నియంత్రణలో కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుంటుండగా, మరోవైపు ఉన్నతాధికారుల పర్యవేక్షణ బాధ్యతలపైనా సమీక్ష జరగాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వేధింపులంటూ ఉద్యోగుల ఆవేదన

ఎఫ్‌డీవో వెంకటేశ్వరరావు వ్యవహారశైలిపై బీట్‌ ఆఫీసర్లు, సెక్షన్‌ ఆఫీసర్లు, రేంజ్‌ ఆఫీసర్లతోపాటు మినిస్టీరియల్‌ సిబ్బంది కూడా అసంతృప్తితో ఉన్నట్లు ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ఫోన్లు పరిశీలించడం,ఉన్న‌తాధికారుల‌తో కింది స్థాయి సిబ్బంది ట‌చ్‌లో ఉండొద్దు హెచ్చరించడం, తమపై విచారణ జరుగుతోందని భయపెట్టడం వంటి చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగుల వ్యక్తిగత వ్యవహారాలపై ఆరా తీస్తూ, విధుల విషయంలో ఒత్తిడి పెంచుతున్నారనే ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో క్షేత్రస్థాయి సిబ్బంది స్వేచ్ఛగా విధులు నిర్వహించలేకపోతున్నారని, ఏ చిన్న పొరపాటు జరిగినా సస్పెన్షన్‌ వేటు తప్పదనే భయంతో పనిచేయాల్సి వస్తోందని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. రెండు డివిజన్ల బాధ్యతలు నిర్వహిస్తున్న ఎఫ్‌డీవో పనితీరు, పర్యవేక్షణ విధానం, క్షేత్రస్థాయి సిబ్బందితో వ్యవహరిస్తున్న తీరుపై ఉన్నతాధికారులు సమీక్షించాలని ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి. వరుస సస్పెన్షన్లకు దారితీసిన ఘటనల్లో కింది స్థాయి అధికారుల పాత్రతోపాటు ఉన్నతాధికారుల ఆదేశాలు, పర్యవేక్షణ బాధ్యతలను కూడా పరిశీలించాలని సూచిస్తున్నాయి. ప్రధాన అటవీ సంరక్షణాధికారి, రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణాధికారి స్థాయి అధికారులు జోక్యం చేసుకుని సమగ్ర విచారణ చేపడితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడుతున్నారు. సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు, విధి నిర్వహణలో భరోసా కల్పించకపోతే అటవీ సంరక్షణ బాధ్యతలు నిర్వహించే క్షేత్రస్థాయి ఉద్యోగులపై ఒత్తిడి మరింత పెరిగే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వెయ్యి గ్రామాలు దాటిన భూ రీసర్వే!

వెయ్యి గ్రామాలు దాటిన భూ రీసర్వే! 2,720 గ్రామాల్లో సమగ్ర సర్వేకు శ్రీకారం ఇప్పటికే...

అండాల అక్రమ దందా.. అసలు సూత్రధారులెక్కడ?

అండాల అక్రమ దందా.. అసలు సూత్రధారులెక్కడ? 43 మంది మహిళలకు విముక్తి.. తొమ్మిది...

మేడిగడ్డ పాపం కేసీఆర్‌దే

మేడిగడ్డ పాపం కేసీఆర్‌దే కుంగుబాటుకు గత ప్రభుత్వ నిర్ణయాలే కారణం ప్రాణహితను పక్కనపెట్టి కాళేశ్వరానికి...

బేతుపల్లి చెరువు కథ సుఖాంతం అందరూ సేఫ్….

బేతుపల్లి చెరువు కథ సుఖాంతం అందరూ సేఫ్.... బేతుపల్లి చెరువును సందర్శించిన మంత్రి తుమ్మల రాష్ట్ర...

వైఎస్సార్‌ నగర్‌ భూములపై విచారణ

వైఎస్సార్‌ నగర్‌ భూములపై విచారణ ఆ భూముల‌తో నాకేలాంటి సంబంధం లేదు విచార‌ణ చేప‌ట్టాల‌ని...

చిట్టీ సొమ్ముకు చిల్లర భూములు

చిట్టీ సొమ్ముకు చిల్లర భూములు రూ.2 లక్షల ప్లాటు.. రూ.20 లక్షల లెక్క! నగదుకు...

సమస్యలు తీరేదెప్పుడు?..

సమస్యలు తీరేదెప్పుడు?.. ఉద్యోగుల గళం వినేదెవరు? పెండింగ్‌ సమస్యల పరిష్కారంపై ఉద్యోగుల్లో ఎదురుచూపులు రెండో వేతన...

మరో వెలుగుమట్లగా వైఎస్సార్‌ నగర్‌!

మరో వెలుగుమట్లగా వైఎస్సార్‌ నగర్‌! మూడు దశాబ్దాలుగా గుడిసెల్లో బతుకులు ఇప్పుడు ఖాళీ చేయాలంటూ ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.