epaper
Tuesday, November 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పేదలకు పింఛన్ల భరోసా.. గ్రామాలకు విద్యుత్ వెలుగులు

పేదలకు పింఛన్ల భరోసా.. గ్రామాలకు విద్యుత్ వెలుగులు
మూడు మండలాల్లో 1,256 మందికి నూతన పింఛన్లు
రూ.3.19 కోట్లతో చల్వాయిలో విద్యుత్ ఉపకేంద్రం
కార్యాలయ భవనాలు, లైన్ల అభివృద్ధికి కోట్లాది రూపాయలు
ములుగు జిల్లాలో విద్యుత్ వ్యవస్థ బలోపేతానికి ప్రత్యేక చర్యలు
మినీ మేడారం జాతరకు ముందస్తు ఏర్పాట్లు

కాకతీయ, ములుగు: పేదలకు సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలవడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, తలసేమియా బాధితులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, రైతులు, గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా మంగళవారం ములుగు నియోజకవర్గంలోని గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో పర్యటించిన మంత్రి నూతన చేయూత పింఛన్ల మంజూరు ఉత్తర్వులను లబ్ధిదారులకు అందజేయడంతో పాటు విద్యుత్ రంగంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

పింఛన్లతో నిరుపేదలకు భరోసా

ఈ పర్యటనలో భాగంగా మూడు మండలాల్లో మొత్తం 1,256 మందికి నూతన చేయూత పింఛన్లు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. గోవిందరావుపేట మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో 487 మందికి, తాడ్వాయి మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో 306 మందికి, ఏటూరునాగారం మండలంలోని 12 గ్రామ పంచాయతీల్లో 463 మందికి పింఛన్లు అందనున్నాయ‌న్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4.70 లక్షల మందికి నూతన పింఛన్లు మంజూరు చేస్తుండగా వారిలో 3.5 లక్షల మంది మహిళలు ఉన్నారని తెలిపారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేత, గీత కార్మికులతో పాటు తలసేమియా బాధితులకు సైతం పింఛన్లు అందిస్తున్నామని, అర్హత ఉండి పింఛన్ రాని వారు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. మహిళలు స్వయం సహాయక సంఘాల్లో చేరి వడ్డీలేని రుణాలతో స్వయం ఉపాధి పొందాలని, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

విద్యుత్ రంగానికి భారీగా నిధులు

పింఛన్ల పంపిణీతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలకు పరిష్కారం చూపేలా పలు పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. గోవిందరావుపేట మండలం చల్వాయిలో రూ.3.19 కోట్లతో 5 ఎంవీఏ సామర్థ్యం కలిగిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ ఉపకేంద్రం అందుబాటులోకి వస్తే చల్వాయి, మాచాపూర్, బుస్సాపూర్ గ్రామాల్లో 580 మంది వ్యవసాయ, 970 మంది ఇతర వినియోగదారులు కలిపి మొత్తం 1,550 మందికి ప్రయోజనం కలగనుంది. ఇదే క్రమంలో తాడ్వాయిలో రూ.17 లక్షలతో విద్యుత్ సబ్‌డివిజన్ కార్యాలయ భవనానికి, ఏటూరునాగారంలో రూ.68.10 లక్షలతో విద్యుత్ డివిజన్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. తాడ్వాయి మండలం లింగాలలో నూతన విద్యుత్ ఉపకేంద్రం ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగా, విద్యుత్ తీగలు, లైన్ల సమస్యల పరిష్కారానికి రూ.3 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం చేపడుతున్న పనులతో పాటు భవిష్యత్తులో పెరగనున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మౌలిక వసతుల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సీతక్క వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సహకారంతో ములుగు జిల్లాలో సుమారు 20 విద్యుత్ ఉపకేంద్రాలకు అనుమతులు పొందగా ములుగు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో 14 ఉపకేంద్రాలు ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు. రామప్ప–లక్నవరం జలవనరుల అనుసంధానంతో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలున్నందున వ్యవసాయ విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గ్రామాల్లో ఇళ్లపై నుంచి వెళ్తున్న విద్యుత్ లైన్లు, కిందికి వేలాడుతున్న తీగలను గుర్తించి సురక్షితంగా మార్చాలని, విద్యుత్ అంతరాయాలు, ట్రిప్పింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. చేపట్టిన నిర్మాణ పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని, రాబోయే మినీ మేడారం జాతరను దృష్టిలో ఉంచుకొని ముందస్తు విద్యుత్ ఏర్పాట్లు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ భిక్షపతి, డీఆర్డీఓ చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి -మండల ప్రత్యేక అధికారి వై.శ్రీకాంత్ రెడ్డి కాకతీయ,రాయపర్తి:...

దొంగే దొంగ అని అరుస్తున్నడు!

దొంగే దొంగ అని అరుస్తున్నడు! వైఎస్సార్‌ నగర్‌ పేదలను ఎందుకు ఖాళీ చేయిస్తున్నావ్‌? గుడిసెవాసులకు...

పేదల జోలికొస్తే ఊరుకునేది లేదు

పేదల జోలికొస్తే ఊరుకునేది లేదు వైఎస్సార్‌ నగర్‌ భూములను మాయం చేసే కుట్ర బీఆర్...

ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు

ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు  చేయూత ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎంపీ కాకతీయ,నెల్లికుదురు: కాంగ్రెస్...

భూనిర్వాసితులకు ప్రత్యేకంగా ఇళ్లు కేటాయించాలి..

భూనిర్వాసితులకు ప్రత్యేకంగా ఇళ్లు కేటాయించాలి.. *భూసేకరణ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి.. *బీజేపీ గీసుగొండ...

మృతులకు మాజీ ఎమ్మెల్యే చల్లా ఘన నివాళులు

మృతులకు మాజీ ఎమ్మెల్యే చల్లా ఘన నివాళులు *మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ...

ఇనుగుర్తిలో చేయూత పెన్షన్ ప్రారంభించిన ఎమ్మెల్యే

ఇనుగుర్తిలో చేయూత పెన్షన్ ప్రారంభించిన ఎమ్మెల్యే త్వరలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయిస్తా..  :ఎమ్మెల్యే...

కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోంది : దాస్యం వినయ్ భాస్కర్..

కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోంది : దాస్యం వినయ్ భాస్కర్.. వైఎస్ఆర్ గుడిసెవాసులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.