epaper
Tuesday, November 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

దొంగే దొంగ అని అరుస్తున్నడు!

దొంగే దొంగ అని అరుస్తున్నడు!
వైఎస్సార్‌ నగర్‌ పేదలను ఎందుకు ఖాళీ చేయిస్తున్నావ్‌?
గుడిసెవాసులకు పట్టాలిచ్చే దమ్ముందా?
నీ అరుపులకు ఎవరూ భయపడరు
కుడా భూముల వ్యవహారంపైనా సమాధానం చెప్పాలి
నాయిని రాజేందర్‌రెడ్డిపై ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్ వినయ్‌ భాస్కర్‌ ధ్వజం

కాకతీయ, హ‌న్మ‌కొండ : “దొంగే దొంగ అని అరుస్తున్నడు.. వైఎస్సార్‌ నగర్‌ పేదలకు పట్టాలిస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు వారినే ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నాడు. నీకు లోపాయికారీ ఒప్పందం లేకపోతే గుడిసెవాసులకు పట్టాలివ్వు. నీ అరుపులకు ఎవరూ భయపడరు” అంటూ వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిపై ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్‌, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్సార్‌ నగర్‌ భూముల వ్యవహారంలో తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ అసలు అంశాన్ని పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం కాజీపేట ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నాయిని వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇస్తూ పలు ప్రశ్నలు సంధించారు. ఎన్నికల సమయంలో వైఎస్సార్‌ నగర్‌ గుడిసెవాసులకు పట్టాలిస్తామని, కాజీపేట ప్రాంతంలో బ్రిడ్జి నిర్మిస్తామని నాయిని హామీ ఇచ్చారని వినయ్‌ భాస్కర్‌ గుర్తుచేశారు. ఇప్పుడు అదే పేదలను ఎందుకు ఖాళీ చేయిస్తున్నారని ప్రశ్నించారు. గుడిసెల వద్దకు జేసీబీలు ఎందుకు వెళ్తున్నాయని నిలదీశారు. వైఎస్సార్‌ నగర్‌ ప్రజలకు అండగా నిలుస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులపై కేసులు ఎందుకు నమోదు చేస్తున్నారని ప్రశ్నించారు. పేదలకు పట్టాలు ఇవ్వకుండా వారిని భయాందోళనలకు గురిచేయడం ఏమిటని మండిపడ్డారు.
“వైఎస్సార్‌ నగర్‌ ప్రజలకు మేము అండగా ఉన్నాం. నీ కుట్రను ప్రజలు గమనించి ఎదురుతిరుగుతున్నారని కొత్త నాటకం ఆడుతున్నావు. నీకు ఎలాంటి లోపాయికారీ ఒప్పందం లేకపోతే పేదలకు పట్టాలు ఇవ్వు” అని సవాల్‌ విసిరారు. గుడిసెవాసుల హక్కుల కోసం తాము పోరాడుతామని, ప్రజల తరఫున ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.

వ్యక్తిగత విమర్శలతో అసలు అంశాన్ని పక్కదారి పట్టించొద్దు

నాయిని రాజేందర్‌రెడ్డి తనపై చేస్తున్న విమర్శలకు భయపడేది లేదని వినయ్‌ భాస్కర్‌ అన్నారు. “నీ అరుపులకు ఎవరు భయపడరు. దొంగే దొంగ అని అరుస్తున్నడు” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా చిల్లర విమర్శలు చేయడం తనకు అలవాటు లేదని, ప్రజా సమస్యలపైనే పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. వైఎస్సార్‌ నగర్‌ భూముల వ్యవహారంలో పేదలకు న్యాయం చేయడమే తమ లక్ష్యమన్నారు. న్యూ శాయంపేట గుడి విషయంలో అల్లుడికి ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం చేశారని, మైనార్టీల భూములను లాక్కోవాలని చూశారని నాయినిపై ఆరోపణలు చేశారు. కుడా భూములను తక్కువ ధరకు కాజేయాలని చూస్తున్నారని విమర్శించారు. తన చరిత్ర గురించి మాట్లాడే ముందు ఈ అంశాలపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. “నీ చరిత్ర నీ నాయకులే విప్పుతారు. నీలా చిల్లర విమర్శలు చేయను” అని వ్యాఖ్యానించారు.

కుడా భూములపై ప్రశ్నలు సంధించిన మర్రి యాదవరెడ్డి

కుడా మాజీ చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి మాట్లాడుతూ నాయిని రాజేందర్‌రెడ్డి మీడియా సమావేశాల్లో అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. అహంకారపూరిత వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. నాయిని దోచుకున్నది, దాచుకున్నది చాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌ నగర్‌లో 144 సెక్షన్‌ ఎందుకు విధించారని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజాపాలన పేరుతో ప్రజలపై నిర్బంధం ఎందుకు విధిస్తున్నారని నిలదీశారు. వినయ్‌ భాస్కర్‌ 15 ఏళ్ల పాలనలో ఎక్కడైనా ఒక్క గుడిసె తొలగించారా? ఇప్పుడు ఎందుకు గుడిసెలు కూల్చుతున్నారని ప్రశ్నించారు. బాలసముద్రంలోని కుడా భూముల వేలంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. లక్షా యాభై వేల రూపాయల విలువైన భూమిని రూ.65 వేలకు ఎలా విక్రయిస్తారని నిలదీశారు. ఆ భూములను అమ్ముతానని, ఇస్తానని నాయిని చెబుతున్నారని, అవి ఆయన సొంత భూములా అని ప్రశ్నించారు.

అభివృద్ధి పనులపై నిలదీత

కాజీపేట చౌరస్తాలోని వాణిజ్య భవనానికి సంబంధించిన అనుమతులు, లావాదేవీలు 2008 నుంచే జరుగుతున్నాయని మర్రి యాదవరెడ్డి తెలిపారు. ఈ వ్యవహారంపై దమ్ము, ధైర్యం ఉంటే విచారణ జరిపించాలని సవాల్‌ చేశారు. నాయిని రాజేందర్‌రెడ్డి మూడేళ్లలో చేసిన ఒక్క అభివృద్ధి పనినైనా చెప్పాలని, కేవలం హోర్డింగులు ఏర్పాటు చేసుకోవడం అభివృద్ధి కాదని విమర్శించారు. కాజీపేట చౌరస్తా రహదారిపై ఉన్న గుంతలను ప్రస్తావిస్తూ స్థానిక సమస్యలను పరిష్కరించాలని సూచించారు. వైఎస్సార్‌ నగర్‌ గుడిసెవాసులు నివసిస్తున్న భూములపై నాయినికి ఎందుకంత ఆసక్తి అని ప్రశ్నించారు. పేదల భూముల జోలికి వెళ్లొద్దని, వారికి న్యాయం చేయాలని కోరారు. గుడిసెవాసులకు నాయిని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని వినయ్‌ భాస్కర్‌ విమర్శించారు. 2023 ఎన్నికల సమయంలో 420 హామీలు, ఆరు గ్యారంటీలు ఇచ్చి వంద రోజుల్లో అమలు చేస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. పలు డిక్లరేషన్లు, సభలు నిర్వహించి కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం హామీలు ఇచ్చిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టో విడుదలై మూడేళ్లు గడుస్తున్నా హామీల అమలు లేదని, మేనిఫెస్టోను చిత్తు కాగితంగా మార్చారని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు నర్సింగరావు, జోరిక రమేష్‌, రాష్ట్ర నాయకులు నార్లగిరి రమేష్‌, గబ్బెట శ్రీనివాస్‌, మర్యాల కృష్ణ, సుంచు కృష్ణ, కటాపురం రాజు, బస్వ యాదగిరి, ఎస్కే మహమూద్‌, ఎండీ అఫ్జల్‌, శ్రీనివాస్‌, బరిగెల వినయ్‌, బండి విజయ్‌, శేఖర్‌, దశరథం, రామ్‌చందర్‌, రంజిత్‌, సుంచు అశోక్‌, తేలు సారంగపాణి, ఎండీ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పేదలకు పింఛన్ల భరోసా.. గ్రామాలకు విద్యుత్ వెలుగులు

పేదలకు పింఛన్ల భరోసా.. గ్రామాలకు విద్యుత్ వెలుగులు మూడు మండలాల్లో 1,256 మందికి...

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి -మండల ప్రత్యేక అధికారి వై.శ్రీకాంత్ రెడ్డి కాకతీయ,రాయపర్తి:...

పేదల జోలికొస్తే ఊరుకునేది లేదు

పేదల జోలికొస్తే ఊరుకునేది లేదు వైఎస్సార్‌ నగర్‌ భూములను మాయం చేసే కుట్ర బీఆర్...

ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు

ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు  చేయూత ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎంపీ కాకతీయ,నెల్లికుదురు: కాంగ్రెస్...

భూనిర్వాసితులకు ప్రత్యేకంగా ఇళ్లు కేటాయించాలి..

భూనిర్వాసితులకు ప్రత్యేకంగా ఇళ్లు కేటాయించాలి.. *భూసేకరణ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి.. *బీజేపీ గీసుగొండ...

మృతులకు మాజీ ఎమ్మెల్యే చల్లా ఘన నివాళులు

మృతులకు మాజీ ఎమ్మెల్యే చల్లా ఘన నివాళులు *మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ...

ఇనుగుర్తిలో చేయూత పెన్షన్ ప్రారంభించిన ఎమ్మెల్యే

ఇనుగుర్తిలో చేయూత పెన్షన్ ప్రారంభించిన ఎమ్మెల్యే త్వరలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయిస్తా..  :ఎమ్మెల్యే...

కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోంది : దాస్యం వినయ్ భాస్కర్..

కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోంది : దాస్యం వినయ్ భాస్కర్.. వైఎస్ఆర్ గుడిసెవాసులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.