epaper
Tuesday, November 17, 2026
epaper
BREAKING NEWS
Loading News...

పేదల జోలికొస్తే ఊరుకునేది లేదు

పేదల జోలికొస్తే ఊరుకునేది లేదు
వైఎస్సార్‌ నగర్‌ భూములను మాయం చేసే కుట్ర
బీఆర్ ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలోనే భూ మార్పిడి
2019లో సీలింగ్‌ భూముల రికార్డుల మార్పు
కాజీపేట చౌరస్తా భవన అనుమతుల్లోనూ అక్ర‌మాలు
ప్రతి అంశానికీ ఆధారాలతో సమాధానం చెబుతా
వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన రికార్డుల వెల్లడి

కాకతీయ, హ‌న్మ‌కొండ‌ : “వైఎస్సార్‌ నగర్‌ ప్రజలకు నేను అండగా ఉంటా. పేదలను ఎవరూ ఇబ్బంది పెట్టకూడదు. భూముల వ్యవహారంలో ఎవరు ఏం చేశారో అధికారిక రికార్డులతోనే ప్రజల ముందు ఉంచుతా. రాజకీయ ఆరోపణలకు భయపడేది లేదు.. ప్రతి అంశానికీ ఆధారాలతో సమాధానం చెబుతా” అని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. కాజీపేట వైఎస్సార్‌ నగర్‌ భూములు, కాజీపేట చౌరస్తాలో నిర్మించిన భవనానికి సంబంధించిన వస్తున్న విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌పై మంగళవారం కాజీపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన పత్రాలు, రెవెన్యూ రికార్డులు, భూముల వివరాలు, నిర్మాణ అనుమతులకు సంబంధించిన డాక్యుమెంట్లను ప్రదర్శించారు.

మూడు శాఖల రికార్డులతో వాస్తవాల వెల్లడి

వైఎస్సార్‌ నగర్‌ గుడిసెవాసుల సమస్యపై గతంలోనే సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించానని నాయిని తెలిపారు. మరింత సమగ్ర సమాచారం కోసం మరోసారి దరఖాస్తు చేశానని వెల్లడించారు. రెవెన్యూ, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ, నగరపాలక సంస్థల నుంచి పత్రాలను సేకరించి పరిశీలించిన తర్వాతే ప్రజల ముందుకు వాస్తవాలు తీసుకొస్తానని చెప్పారు. ఇప్పటివరకు తాను ఏ అంశంపై మాట్లాడినా అధికారిక రికార్డులు, ఆధారాల ఆధారంగానే స్పందించానని, ఊహాగానాలతో ఆరోపణలు చేయడం తనకు అలవాటు లేదని పేర్కొన్నారు. వైఎస్సార్‌ నగర్‌ భూములకు సంబంధించి ఇరానీ కుటుంబానికి చెందిన భూములు పట్టణ భూ పరిమితి చట్టం పరిధిలోకి వచ్చాయని ఎమ్మెల్యే వివరించారు. ఈ వ్యవహారంపై అప్పట్లో కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. న్యాయస్థానంలో కేసు కొనసాగుతున్న సమయంలోనే 2019లో అప్పటి బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో, అప్పటి ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో ఆ భూములను వ్యవసాయేతర అవసరాలకు మార్చి ఇరానీ కుటుంబ సభ్యుల పేర్లపై ఎలా నమోదు చేశారని ప్రశ్నించారు. 2018 వరకు రెవెన్యూ రికార్డుల్లో సీలింగ్‌ భూములుగా నమోదైన భూముల్లో 2019లో ఏ విధంగా మార్పులు జరిగాయన్నది కీలకమని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పహాణీలు, ఇతర అధికారిక రికార్డులను మీడియా ముందు ఉంచుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ భూముల వ్యవహారంలో గుడిసెవాసుల హక్కులపైనా సమగ్ర విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు. భూములపై హక్కులు, రికార్డుల మార్పులు, అప్పటి నిర్ణయాల వెనుక ఉన్న పరిస్థితులన్నీ పరిశీలించినప్పుడే పూర్తి వాస్తవాలు బయటపడతాయని అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పేదలకు పింఛన్ల భరోసా.. గ్రామాలకు విద్యుత్ వెలుగులు

పేదలకు పింఛన్ల భరోసా.. గ్రామాలకు విద్యుత్ వెలుగులు మూడు మండలాల్లో 1,256 మందికి...

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి -మండల ప్రత్యేక అధికారి వై.శ్రీకాంత్ రెడ్డి కాకతీయ,రాయపర్తి:...

దొంగే దొంగ అని అరుస్తున్నడు!

దొంగే దొంగ అని అరుస్తున్నడు! వైఎస్సార్‌ నగర్‌ పేదలను ఎందుకు ఖాళీ చేయిస్తున్నావ్‌? గుడిసెవాసులకు...

ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు

ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు  చేయూత ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎంపీ కాకతీయ,నెల్లికుదురు: కాంగ్రెస్...

భూనిర్వాసితులకు ప్రత్యేకంగా ఇళ్లు కేటాయించాలి..

భూనిర్వాసితులకు ప్రత్యేకంగా ఇళ్లు కేటాయించాలి.. *భూసేకరణ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి.. *బీజేపీ గీసుగొండ...

మృతులకు మాజీ ఎమ్మెల్యే చల్లా ఘన నివాళులు

మృతులకు మాజీ ఎమ్మెల్యే చల్లా ఘన నివాళులు *మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ...

ఇనుగుర్తిలో చేయూత పెన్షన్ ప్రారంభించిన ఎమ్మెల్యే

ఇనుగుర్తిలో చేయూత పెన్షన్ ప్రారంభించిన ఎమ్మెల్యే త్వరలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయిస్తా..  :ఎమ్మెల్యే...

కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోంది : దాస్యం వినయ్ భాస్కర్..

కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోంది : దాస్యం వినయ్ భాస్కర్.. వైఎస్ఆర్ గుడిసెవాసులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ముంబైపై బిష్ణోయ్‌ గురి!

ముంబైపై బిష్ణోయ్‌ గురి! దావూద్‌ తర్వాత మాఫియా పగ్గాలు చేపట్టే వ్యూహమా? సిద్ధూ మూసేవాలా...

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.