epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఎర్రకోట బ్లాస్ట్ మాడ్యూల్‌కి పీఓకే నుంచి డైరెక్షన్స్.. దర్యాప్తులో సంచలనాలు

ఎర్రకోట బ్లాస్ట్ మాడ్యూల్‌కి పీఓకే నుంచి డైరెక్షన్స్.. దర్యాప్తులో సంచలనాలు!
ఎర్రకోట బ్లాస్ట్ వెనక బ‌య‌ట‌ప‌డ్డ అంతర్జాతీయ ఉగ్ర జాలం
పీఓకే–అఫ్గాన్ హ్యాండ్లర్లే మాస్టర్మైండ్స్
జైషే మహ్మద్ లింకులు బట్టబయలు

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : దేశ రాజ‌ధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనతో భద్రతా వ్యవస్థలు అలర్ట్‌ అయ్యాయి. మొదట సాధారణ బ్లాస్ట్‌లా కనిపించినా, దర్యాప్తు లోతుకు వెళ్తే విదేశీ ఉగ్రజాలం తెర మీదకి వచ్చింది. ఈ బ్లాస్ట్ వెనక ఉన్న నెట్‌వర్క్ కేవలం దేశీయంగానే కాకుండా, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే), అఫ్గానిస్థాన్‌లో ఉన్న హ్యాండ్లర్లు నడిపిన ఆపరేషన్‌గా అధికారులు నిర్ధారించారు.

దర్యాప్తు ఏజెన్సీలు ట్రేస్ చేసిన డిజిటల్ కమ్యూనికేషన్ ప్రకారం, ఎర్రకోట బ్లాస్ట్‌ మాడ్యూల్‌కు పీఓకేలో ఉన్న ఫైజల్ ఇష్ఫాక్ భట్‌, అఫ్గానిస్థాన్‌లో ఉన్న డాక్టర్ ఉకాసా అనే ఇద్దరు టాప్ హ్యాండ్లర్ల నుంచి నేరుగా ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. వారి సూచనల మేరకే బ్లాస్ట్ ప్లానింగ్‌, అమలు జరిగిందని విచారణాధికారులు వెల్లడించారు. అదేవిధంగా, మూడో హ్యాండ్లర్ హషీమ్‌ కూడా టెలిగ్రామ్‌ ద్వారా మాడ్యూల్ సభ్యులతో నిరంతరంగా సంప్రదింపులో ఉన్నట్లు ఆధారాలు గుర్తించారు. ఈ ముగ్గురు కలిసి దేశంలో పెద్ద మోడ్యూల్ రూపొందించేందుకు ప్రయత్నించినట్టు సమాచారం.

ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన డాక్టర్ ఉమర్ నబీతో పాటు మరికొందరు జైషే మహ్మద్ ఉగ్ర సంస్థతో ప్రత్యక్ష లింకులు కలిగి ఉన్నట్టు దర్యాప్తు నిర్ధారించింది. గతంలోనూ ఈ నెట్‌వర్క్‌ పీఓకే నుంచి భారతదేశంపై ఉగ్ర దాడులకు ప్రయత్నించిన రికార్డులు ఉన్నాయి. ఇక‌పోతే దర్యాప్తులో బయటపడిన మరో షాకింగ్ అంశం.. ఈ ఆపరేషన్‌కు వచ్చిన ఆర్థిక సహాయం. పీఓకే నుంచి హవాలా మార్గంలో ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ఆధారాలు లభించాయి.

అలాగే ఆన్‌లైన్ క్రిప్టో వాలెట్ల ద్వారా చిన్న మొత్తాలుగా డబ్బులు పంపిన సమాచారం దొరికింది. వాటిని విడమరచి చూస్తే, మొత్తం ప్లానింగ్‌ అనేది బాగా స్ట్రక్చర్డ్‌గా ఉందని ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. వీరు టెలిగ్రామ్ ఛానెల్స్, కోడ్‌వర్డ్ మెసేజ్‌లు, వర్చువల్ సిమ్‌లు, VPNలు ఉపయోగించి కమ్యూనికేషన్ జరిపినట్లు ఆధారాలు చెబుతున్నాయి. విచారణలో స్వాధీనం చేసిన పరికరాల్లో బర్న్ చాట్‌లు, వర్చువల్ సిమ్‌లు, VPN ట్రైల్స్ కనిపించడంతో ఇది ప్లాన్‌డ్ ఇంటర్నేషనల్ టెర్రర్ ఆపరేషన్ అని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, ఎర్రకోట పేలుడు వెనుక ఉన్న అంతర్జాతీయ టెర్రర్ లింకులు బయటపడటంతో, కేసు మరింత సీరియస్ మలుపు తీసుకుంది. ఈ నేప‌థ్యంలోనే దేశ భద్రతా వ్యవస్థలు ఇప్పుడు ఈ నెట్‌వర్క్‌ కి భారత్‌లో ఉన్న స్లీపర్ సెల్స్‌ను గుర్తించడంపై దృష్టి సారించాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.