epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

కారు బాంబు కుట్రలో కొత్త మలుపు.. షాహిన్–ముజమ్మిల్ భార్యాభర్తలే!

కారు బాంబు కుట్రలో కొత్త మలుపు.. షాహిన్–ముజమ్మిల్ భార్యాభర్తలే!
ఢిల్లీ కారు బ్లాస్ట్‌ కేసులో సంచలనం
షాహిన్–ముజమ్మిల్ భార్యాభర్తలే అన్న నిజం బ‌ట్ట‌బ‌య‌లు
జైషే మహ్మద్ నెట్వర్క్‌లో షాహిన్ చురుకుదనం

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్‌: ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తు రోజురోజుకూ కొత్త కోణాలు సంతరించుకుంటోంది. ఇప్పటివరకు గర్ల్‌ఫ్రెండ్‌గా చెప్పబడిన డాక్టర్ షాహిన్ షహిద్ సహనిందితుడు ముజమ్మిల్ షకీల్ భార్య అని విచారణలో వెల్లడైంది. 2023లో అల్-ఫలా యూనివర్సిటీ దగ్గర ఉండే మతపరమైన స్థలంలో వీరు నిఖా చేసుకుని, రహస్యంగా జీవించినట్టు షకీల్ వివరించాడు.

షాహిన్ పాత్ర దర్యాప్తులో మరింత కీలకంగా మారింది. 2023లో ముజమ్మిల్‌కు ఆయుధాలు కొనుగోలు చేయడానికి ఆమె రూ. 6.5 లక్షలు అందజేసినట్టు, 2024లో బాంబర్ ఉమర్ నబీ కోసం ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కొనడానికి మరో రూ. 3 లక్షలు ఇచ్చినట్టు ఆధారాలు బయటపడ్డాయి. మొత్తం మీద జైషే మహ్మద్ మాడ్యూల్ కార్యకలాపాలకు రూ. 27–28 లక్షల వరకు ఆమె ‘విరాళం’ పేరిట సమకూర్చినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

జైషే మహ్మద్ మహిళా యూనిట్‌లో షాహిన్‌కు ప్రాధాన్యత ఉందనే విషయం ఇప్పటికే బయటపడింది. పాక్‌ ఆదేశాల మేరకు భారతదేశంలో మహిళా బ్రిగేడ్‌లను ఏర్పరచడం, రిక్రూట్‌మెంట్ నిర్వహించడం వంటి కార్యకలాపాలు ఆమె ద్వారా సాగినట్టు అనుమానాలు ఉన్నాయి. మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ నేతృత్వం వహిస్తున్న జమాత్ ఉల్ మొమినాత్ విభాగంలో షాహిన్ యొక్క ఇన్వాల్వ్‌మెంట్‌పై NIA ప్రత్యేక దృష్టి పెట్టింది.

భారత్ ఇటీవల చేపట్టిన ఆపరేషన్ “సిందూర్”లో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబం దెబ్బతినడంతో, ఈ మాడ్యూల్ కార్యకలాపాలు విచ్ఛిన్నం అయ్యాయి. దాంతో భారత భూభాగంలో నిద్రాణ కణాలు, మహిళా బ్రిగేడ్ ఆక్టివిటీలు తిరిగి చురుకుగా మారాయా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. నవంబర్ 10న ఎర్రకోట దగ్గర జరిగిన కారు బాంబు పేలుడు వెనుక ఉన్న కుట్రను పూర్తిగా అన్‌రావెల్ చేయడానికి NIA అడుగులు వేగవంతం చేసింది. ఇప్పటివరకు కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసినా, షాహిన్–ముజమ్మిల్ సంబంధం బయటపడటం దర్యాప్తుకు కొత్తదారులు తీసుకువచ్చింది. జైషే మాడ్యూల్‌లోని పెద్దల ఆదేశాల మేరకా లేక స్థానికంగా పన్నిన ప్లానా అన్నది ఇంకా స్పష్టత రాలేదు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వ్యూహకర్త కాదు… విజేత..!

వ్యూహకర్త కాదు... విజేత..! బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ సంచలనం ప్రత్యక్ష రాజకీయాల తొలి...

పురుగులు ప‌రుగులు పెట్టించాయి

పురుగులు ప‌రుగులు పెట్టించాయి ఢిల్లీని కదిలించిన జెన్‌జీ జోరు! హేళనగా పుట్టిన 'కాక్రోచ్ జనతా...

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు

13 ఏళ్ల విద్యార్థినిపై తోటి విద్యార్థుల లైంగిక వేధింపులు పాఠశాల ఆవరణలోనే జరిగిన...

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన ‘మెలోడీ’ జోడీ

జీ7 సదస్సులో మరోసారి మెరిసిన 'మెలోడీ' జోడీ ఎవియన్‌లో ముచ్చటించుకున్న మోదీ, మెలోనీ సోషల్...

భార్యకు పెళ్లి చేసిన భర్త

భార్యకు పెళ్లి చేసిన భర్త పన్నెండేళ్లు చిన్నవాడైన యువకుడితో వివాహిత ఎఫైర్ మహిళను కలిసేందుకు...

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్

బెంగాల్ వీధుల్లో ‘అంకుశం’ సీన్ రిపీట్ దోపిడీలు, భూకబ్జాల కేసుల్లో అరెస్టయిన ‘ఫాల్తా...

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!

మంత్రి రామలింగారెడ్డి రాజీనామా! బెంగళూరు అభివృద్ధి శాఖ ఇస్తామని మాటిచ్చి త‌ప్పారు సాగునీటి శాఖ...

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు

రితాబ్రతా బెనర్జీ తిరుగుబాటు సీపీఎం నుంచి తృణమూల్ మీదుగా బీజేపీ వైపు నయా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.